డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై కొత్త సిలబస్‌

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీలో సిలబస్ మార్చాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు నైపుణ్యాలు, కంప్యూటర్‌పై అవగాహన లేకపోవడం వల్ల ఉద్యోగాలకు ఎంపిక కావాడం లేదని కొత్త సిలబస్ తీసుకురావాలనుకుంది.

TELANGANA LOGO
New Update

డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో మూడు ఏళ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేస్తుండగా.. డిగ్రీ సిలబస్‌ను మార్పులు చేసి కనీసం ఆరేళ్లు అవుతుండగా కూడా చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకురావాలని..

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు అకాడమీ, విద్యామండలి నిర్ణయించిన సిలబస్ బట్టి కొత్త పాఠ్య పుస్తకాలను ముద్రించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2019లో చివరిసారిగా సిలబస్‌లో మార్పులు చేశారు. అప్పుడు కూడా కేవలం ఇంగ్లీషు సబ్జెట్‌ను చివరి ఏడాదిలో చేర్చారు.

ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్‌-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!

మిగతా సబ్జెట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల గురించి పూర్తిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారని భావించింది. 

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!

ఏదో విద్యార్థులు కాలేజీలో చేరారా? పరీక్షలు రాశారా? సర్టిఫికేట్లు తీసుకున్నారా? ఇంతే జరుగుతుంది. కానీ వారికి ఎలాంటి కమ్యునికేషన్ స్కిల్స్ లేకపోవడం, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రాకపోవడం వంటివి జరగడం లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి నిశ్చయించుకుంది. నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు వస్తున్నాయని, మిగతా వారికి రావడం లేదని ప్రభుత్వం భావించింది.అందుకే సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు విద్యార్థులకు నైపుణ్యాల్లో ముందు ఉండాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 

ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్‌ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!

#degree
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe