కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. లేక పోయినా.. రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ల హవా మాత్రం జోరుగానే ఉంటుంది. వీరికి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం, తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు ఘనంగా లభిస్తుంది. టికెట్లు, పదవులు ఆశించేవారు వీరిని ప్రసన్నం చేసుకోవడానికి వీరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్దీ హవా అంతకంతకూ పెరుగుతూ ఉంటుందన్న టాక్ ఉంది. టికేట్ల కేటాయింపులో వీరు కీలకంగా ఉండడమే ఇందుకు కారణం. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, మాణిక్కం ఠాగూర్, మాణిరావు ఠాక్రే తదితరులు కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రభావం చూపారు. ఇందులో మాణిక్కం ఠాగూర్ పై సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రేవంత్ తో సన్నిహిత్యంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఆయనను తప్పించి మాణిక్ రావు ఠాక్రేను నియమించింది హైకమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన అనంతరం ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దీపదాస్ మున్షికి ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించింది హైకమాండ్.
ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!
అయితే.. తెలంగాణలోనే తిష్ట వేసిన మున్షి అధికార దర్వినియోగం చేస్తోందంటూ మీడియాలో కథనాలు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఆమె సమంతర పాలన నడుపుతున్నారంటూ ఆ వార్త కథనాలు పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె “Viceroy of Telangana” ఆమెకు నిక్ నేమ్ ఉందని ఆరోపణలు చేసింది ఆ కథనం. మున్షి రాష్ట్రంలోనే స్థిరపడి.. తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారని పేర్కొంది. ఈ విషయమై పార్టీ పెద్దలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం?
ఆమె లక్షల రూపాయాలు అద్దె కలిగిన ఖరీదైన భవనాల్లో ఉంటున్నారని.. ఇంకా ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపింది. అంతటితో ఆగకుండా అధికారిక సమీక్షల్లో పాల్గొంటూ ఆదేశాలను ఇస్తున్నారని వెల్లడించింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిపక్ష నేతలు ఈ కథనాన్ని అస్త్రంగా చేసుకుని వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ కథనాలపై హస్తం నేతలు ఎలా రియాక్ట్ అవుతారు? హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్న అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠగా మారింది.