BIG BREAKING: కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్!

ఎట్టకేలకు తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. వివేక్ కు మైనింగ్ కార్మిక శాఖ, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ యూత్, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు.

New Update
New Ministers

ముగ్గురు కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. గడ్డం వివేక్-లేబర్ అండ్ మైనింగ్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ - ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. వాకిటి శ్రీహరి - పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖలను కేటాయించారు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 8న ఈ ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు.

New ministers

క్యాబినెట్ విస్తరణ జరిగిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చలు జరిపారు. ఓ దశలో పాత మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయన్న చర్చ సాగింది. ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, మరో కీలక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఈ అంశంపై భారీగా ఊహాగానాలు వినిపించాయి. ఈరోజు ఉదయం ఈ వార్తలను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. కుల గణన పై చర్చించేందుకే తాను ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని తెలిపారు. దీంతో శాఖల మార్పు అంశానికి బ్రేక్ పడింది. సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదలైంది.

Advertisment
తాజా కథనాలు