/rtv/media/media_files/2025/03/30/GDN9LeV6c5Sg9gBdSBlv.jpg)
cm-revanth-reddy meets varma
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంటకు పైగా గవర్నర్ తో సీఎం చర్చించారు. ఈ భేటీలో సీఎం మంత్రివర్గ విస్తరణపై ప్రముఖంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం వెంట మంత్రి కొండా సురేఖ కూడా తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.
రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 30, 2025
సుమారు గంటన్నర పాటు సాగిన భేటీ
అనంతరం రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయిన సీఎం రేవంత్
కేబినెట్ విస్తరణ ప్రచారంతో గవర్నర్తో సీఎం భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి pic.twitter.com/tJc6pjORTe
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
ప్రతి సంకల్పం నెరవేరింది
జీవితంలో తాను తీసుకున్న ప్రతి సంకల్పం నెరవేరిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. తాను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కొత్త నగరాలకు ఫ్యూచర్ సిటీ నమూనా అవుతుందని తెలిపారు. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. అభివృద్ధి జరిగినప్పుడు అడ్డంకులొస్తాయని.... అలాగని ఆగిపోకుండా అందరి సహకారం తీసుకుంటామని తెలిపారు. దేవుళ్లనే నూటికి నూరు శాతం ఆమోదించడం లేదని సీఎం అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికలా ఉందని వెల్లడించారు.