BIG BREAKING: బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి బీజేపీ లోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పాతబస్తీలో నిన్న జరిగిన బోనాల వేడుకల్లో బీజేపీ కీలక నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. బండి సంజయ్ కోసం ప్రీతి నిన్న దాదాపు 5 గంటల పాటు వెయిట్ చేసినట్లు తెలుస్తోంది. సంజయ్ తో కలిసి లంచ్ ఆమె లంచ్ చేశారు. బీజేపీ భాగ్యనగర్ నాయకుడు ప్రీతి, బండి సంజయ్ ఫొటోలతో కలిపి ప్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో ఈ ఇద్దరి భేటీ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తమ కుటుంబం నుండి ముగ్గురం పోటీ చేస్తామని మల్లారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే మల్లారెడ్డి కుటుంబం నుండి మల్లారెడ్డి మేడ్చల్, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు