అదును చూసి ఈటల అంతు చూసిన బండి.. హైకమాండ్ వద్ద సంజయ్ చేసిన వాదన ఇదే?

తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసు నుంచి ఈటలను తప్పించడం వెనుక బండి సంజయ్ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వొద్దని ఆయన హైకమాండ్ ను కన్విన్స్ చేసినట్లు సమాచారం

New Update

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఒక్కరే పదవికి నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే.. తెలంగాణలో బీసీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని చాలా రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ అధ్యక్షుడు కావడం కాయమని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా రాంచంద్రరావు వైపు హైకమాండ్ మొగ్గు చూపడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. రామచంద్ర రావు ఎన్నిక వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ చక్రం తిప్పారన్న చర్చ కమలం పార్టీలో జోరుగా సాగుతోంది. ఈటల రాజేందర్ తో పాటు పోటీలో ఉన్న ఇతర నేతలతో ఉన్న విభేదాల నేపథ్యంలో బండి సంజయ్ వారికి పదవి రాకుండా చేశారన్న చర్చ సాగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి పదవి ఇస్తే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని హైకమాండ్ ను కన్విన్స్ చేయడంలో సంజయ్ సక్సెస్ అయ్యారని బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బండి వ్యూహం ఇదేనా..

గత అసెంబ్లీకి కొన్ని రోజుల ముందు బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే.. అప్పుడు బండిని తప్పించడం వెనుక ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ లాంటి నేతలు ఉన్నారన్న చర్చ సాగింది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కు కేంద్ర నాయకత్వంతో సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. 

ఈ నేపథ్యంలో తన పలుకుబడిని ఉపయోగించి గతంలో తన పదవి పోవడానికి కారణమైన వారెవరికీ ఛాన్స్ రాకుండా చక్రం తిప్పారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న రాంచంద్రరావు పదవీకాలం 2028 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ముగుస్తుంది. దీంతో ఆ సమయంలో మళ్లీ తాను పగ్గాలు చేపట్టి ఎన్నికల సమయంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నది బండి వ్యూహంగా తెలుస్తోంది. 

#eatala-rajendar #Bandi Sanjay
Advertisment
Advertisment
తాజా కథనాలు