తెలంగాణలో 12 మంది హెడ్ మాస్టర్లపై వేటు.. ఎందుకో తెలుసా?

తెలంగాణలో 12 మంది ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబరులో ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
TELANGANA LOGO

Head Masters: తెలంగాణలో 12 మంది ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది సెప్టెంబరులో ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా సస్పెండ్ చేసిన ప్రధాన ఉపాధ్యాయులల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 10 మంది ఉండడం గమనార్హం. అలాగే వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒక్కో హెచ్‌ఎంను సస్పెండ్‌ అయ్యారు. వీరిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్‌ ఆర్జేడీ విజయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు

ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత...

ఏకకాలంలో 12 మంది ప్రధాన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం చర్చనీయంశమైంది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఏడాది తర్వాత ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ రూల్స్ ప్రకారం.. ట్రాన్స్ఫర్స్ సందర్భంగా భర్త లేదా భార్య తన స్పౌజ్‌ పనిచేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్‌ ఇచ్చుకోవాలి. కాగా కొందరు ఈ స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేశారని విద్యాశాఖ నిర్ణయానికి ఫిర్యాదు రావడంతో వారిని సస్పెండ్‌ చేసింది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం!

మహబూబ్‌నగర్‌లో ఒకరు తన స్పౌజ్‌ పనిచేసే పాఠశాలకు మొదటి ఆప్షన్‌ ఇచ్చుకోకుండా నాలుగో ఆప్షన్‌ ఇచ్చుకున్నారు. అయితే.. నాలుగో ఆప్షన్ ఇచ్చుకున్న సరే అతనికి తన స్పౌజ్‌ పనిచేసే బడికే బదిలీ అయింది. అయినా తొలి ఆప్షన్‌ ఇచ్చుకోకుండా నాలుగో ఐచ్ఛికం ఎందుకు ఇచ్చుకున్నారని విద్యాశాఖ ఆయనను సస్పెండ్‌ చేయడం చర్చకు దారి తీసింది. సస్పెన్షన్లపై పునఃసమీక్షించి వాటిని ఎత్తివేయాలని గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు