Municipal election results 2026: తెలంగాణలో బోణీ కొట్టిన టీడీపీ.. ఎక్కడంటే?

ఖమ్మం జిల్లా మధిరలో టీడీపీ తన ఉనికిని చాటుకుని బోణీ కొట్టింది.కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వెలువడిన ఫలితాల్లో 10వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘన విజయం సాధించారు.

New Update
tdp

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి.  ఖమ్మం జిల్లా మధిరలో టీడీపీ తన ఉనికిని చాటుకుని బోణీ కొట్టింది.కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా వెలువడిన ఫలితాల్లో 10వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘన విజయం సాధించారు. పాత కోటలో సైకిల్ గుర్తు మళ్ళీ మెరవడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. 1వ వార్డు, 13వ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేయగా, కాంగ్రెస్ పార్టీ 7, 16,21వ వార్డులను కైవసం చేసుకుని గట్టి పోటీనిస్తోంది.  కల్వకుర్తిలో వార్డు వార్డుకూ ఉత్కంఠ కొనసాగుతోంది, ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు