/rtv/media/media_files/2025/11/19/local-body-elections-in-telangana-2025-11-19-20-33-46.jpg)
Local body elections in telangana
Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గ్రామ స్థాయి ఎన్నికలు కావడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు, గ్రామస్తులకు మధ్య పరిచయాలు ఉం మీ వద్దకొచ్చిన. నాకే మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ వేస్తామని ఒట్టేయండి.. లేకుంటే నేను మీ ఇంటి నుంచి కదలా.. ఈడనే కూర్చుంటా.. వాళ్లు పైసలిచ్చినా తీసుకోండి. మందు సీసా పంచినా కాదనకండి.. ఓటు మాత్రం నాకే వేసి నన్ను దీవించండి.. ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చి చూడండి ఊరి గతిని మారుస్తానంటూ మంకు పట్టుపడుతున్నారు. దేవుని పటం మీద ప్రమాణం చేసి చెప్పుర్రి మీ ఓటు నాకేనంటూ ప్రమాణాలు చేయించుకుంటున్నారు.తెలంగాణలోని పలు జిల్లాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లతో బలవంతంగా చేతిలో చెయ్యేసి, లేదంటే దేవుడిపటంపై ఒట్టు వేయిస్తున్నారు.
ఇక కుల సంఘం నాయకులను మచ్చిగ చేసుకుని వారిచేత ఆ సంఘం ఓట్లు అన్ని మూకుమ్మడిగా పడేటట్లు చూడాలని వేడుకుంటున్నారు. ఆ సంఘం నాయకులు కూడా మరో అడుగు ముందుకేసి ‘మాది మాటంటే మాట. మా సంఘం వాళ్ల 80 ఇళ్లలోని ఒక్క ఓటు కూడా మరో పార్టీకి వేయం, మొత్తం మీకే వేస్తాం. కావాలంటే మీ ఎదుటే ప్రమాణం చేస్తాం. మా సంఘం పెద్ద మనుషులంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. మీరేమి దిగులు చెందొద్దు. వేరే అభ్యర్థి వచ్చి ఓట్లు అడిగినా వేస్తామని చెబుతాం. మీకు ప్రమాణం చేసినం. కాబట్టి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మా ఓట్లు పడవు అంటూ భరోసా ఇస్తున్నారు.
ఓటర్లు తమ నుంచి జారి పోవద్దనే ఉద్దేశంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రమాణాలు చేయించుకుంటున్నారు. చేతిలో చెయ్యేసి మాట తీసుకోవడంతోపాటు వాళ్లడిగినంత నగదు అందిస్తూ గుడి వద్ద లేదా దేవుడి చిత్రపటాలపై చేయి వేయించి మద్దతు బలాన్ని పెంచుకుంటున్నారు. మొదటి విడత ప్రచారం పూర్తికాగా.. రెండు, మూడో విడత ప్రచారాలు పంచాయతీల్లో జోరుగా సాగుతున్నాయి. మరికొందరైతే ఏకంగా కాళ్లపై పడుతున్నారు.
ఈసారి సర్పంచ్ కోసం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో యువత శాతమే ఎక్కువగా ఉంది. సర్పంచి అభ్యర్థుల్లో చాలామంది తమ వయసు కన్నా పెద్దవారు ఎవరు కనిపించినా కాళ్లపై పడుతూ ఓట్లు వేయమని అభ్యర్తిస్తున్నారు. ‘తప్పకుండా బిడ్డా.. నీకే ఓటేస్తామని’ ఓటరు చెబుతున్నా.. కాళ్ల వద్ద నుంచి లేచాక.. ఓటరు అరచేతిని.. అభ్యర్థి తలపై పెట్టుకుని ‘జర నాకే ఓటేస్తామని’ మాటియ్యండనే అభ్యర్థనలే అంతటా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటర్లు కూడా ఏ అభ్యర్థిని కాదనలేక.. ‘ఒట్టెందుకు గానీ.. నీకు తప్ప ఇంకొకరికి ఓటు ఎందుకేస్తామని' తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Follow Us