కరీంనగర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పేస్ బుక్ లో ప్రేమించుకున్న ఓ జంట ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కరీంనగర్ కు చెందిన ఓ వివాహిత మహిళకు జమ్మికుంట కు చెందిన కోడూరి రాజేష్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమికులుగా మారారు. ఇద్దరు కలిసి తిరిగారు. ఈనెల 21 వివాహిత మహిళా జమ్మికుంటలోని రాజేష్ ఇంటికి చేరింది. ఇద్దరు కలిశాక ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
రాజేష్ ఇంటికి పిలిచాడని, కోరిక తీర్చాలని లేదంటే చంపుతానని బెదిరించాడని, అందుకు తాను నిరాకరిస్తే బలవంతంగా అత్యాచారం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు చేసింది. మరోవైపు రాజేష్ మాత్రం ఆమె చెప్పేది అబద్దమని తెలిపాడు. జమ్మికుంట కు వచ్చిన మహిళా.. తన దగ్గర డబ్బులు డిమాండ్ చేసిందని, ఇవ్వకపోతే రేప్ కేసు పెడుతానని బెదిరించడంతో పది వేలు ఇవ్వగా.. మరో పది వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేసినట్లు తెలిపాడు.
Also Read : మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఊరు..ట్విస్టులతో సాగిన 'క' ట్రైలర్
వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఇద్దరి ఫిర్యాదులను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపడితే.. అందులో విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో వివాహిత మహిళా కిలాడిగా మారి పలువును మోసం చేసిందని తేలింది. రాజేష్ నే కాకుండా కరీంనగర్ టూ టౌన్ పరిధిలో ఇద్దరిని మోసం చేసి రెండు లక్షల 20 వేల వరకు వసూలు చేసిందని గుర్తించారు.
మానకొండూరు పీఎస్ పరిధిలో ఐదుగురు గ్యాంగ్ రేప్ చేశారని బ్లాక్ మెయిల్ కు పాల్పడిందని పోలీసుల విచారణలో బయటపడింది. మరొకరిని మోసం చేయకుండా ఉండేందుకు మహిళపై సైతం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జమ్మికుంట సీఐ రవీందర్ తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు రాజేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అంతేకాకుండా ఫేస్ బుక్, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సిఐ సూచించారు.
Also Read : మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఊరు..ట్విస్టులతో సాగిన 'క' ట్రైలర్