BIG BREAKING: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Road Accident Nalgonda

TG Crime: నల్గొండ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది.  ఒక్కసారిగా కారు.. బస్సు కిందికి దూసుకుపోయి ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. మరోకారు అదుపుతప్పి డివైడర్‌ను గుద్దింది. 

ప్రైవేటు బస్సు సడన్‌ బ్రేక్‌ వేసి...


ఇది కూడా చదవండి:
 కండరాల నొప్పులా.. అరటిపండ్లు, కొబ్బరి నీళ్లతో ఇన్ని లాభాలున్నాయా..? కానీ ఇలా ట్రై చేయకండి

ప్రమాదపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉన్నది.  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయి వాహనదారులు కొద్దీ సేపు ఇబ్బందికి గురయ్యారు. పోలీసులు రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

ఇది కూడా చదవండి: ఛాతీలో మంట, వికారం గుండెపోటుకు కారణమా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు