/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
Rain alert for Telangana : గడచిన 24 గంటల్లో రాష్ర్ట వ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం పూర్తిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వెల్లడించింది. గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది