బీజేపీ ఆ పదవి ఇస్తే తీసుకుంటా: తొలిసారి ఓపెన్ అయిన ఆర్ కృష్ణయ్య!

బీసీల కోసమే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకుంటానన్నారు. పార్టీలో చేరాలని బీజేపీ నేతలు తనను సంప్రదించలేదన్నారు. RTVకి ఆయన ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

New Update

తన రాజీనామా వెనుక ఎవరూ లేరని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీల కోసమే తాను రాజీనామా చేశానన్నారు. బీసీల కోసమే తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన RTVకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తాను ఇప్పటివరకు ఆయనను కలవలేదన్నారు. జగన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు.

బీసీలను బలహీనం చేయాలనే కుట్ర

ఎంపీ పదవి తన 50 ఏళ్ల పోరాటం ముందు చాలా చిన్నదన్నారు. బీసీ ఉద్యమాన్ని బలహీనం చేయాలన్న కుట్రతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనను బీజేపీ నేతలు ఎవరూ పార్టీలోకి రమ్మని ఆహ్వానించలేదన్నారు. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకుంటానన్నారు. అది ఒక గొప్ప సంస్థ అన్నారు. బీసీలకు అనేక రకాలుగా సేవ చేసే అవకాశం ఆ పదవి ద్వారా లభిస్తుందన్నారు. ఆర్ కృష్ణయ్య పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

 

#telangana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి