Hyderabad: హైదరాబాద్ లో మరో వ్యభిచార గృహం గుట్టు రట్టైంది. తార్నాక నాగార్జున నగర్ లోని ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నడుస్తున్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉగాండాకు చెందిన ఇద్దరు మహిళలు, ఒక విటున్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉగాండ మహిళలు అరెస్టు..
ఈ మేరకు ఉగాండా దేశానికి చెందిన నయాబరే డోరీన్(42), కొముహంగీ రిటా (22), తార్నాకలోని నాగార్జున నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల వారు గమనించిన సమాచారం ఇవ్వగానే సంఘటన స్థలానికి దాడులు నిర్వహించాం. వ్యభిచారం చేస్తున్న యుగాండా దేశానికి చెందిన నిర్వాహకులతోపాటు, విటుడు ఉప్పల్ పీర్జాదిగూడ కు చెందిన పోటూరి అంజన్ కుమార్(45) ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం. వీరి వద్దనుండి 5 సెల్ ఫోన్లు, 160 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.