Jaggareddy: ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోవు...జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి ఏడ్చారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడంపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. నువ్వెంతా.. నీ బతుకెంతా? అని మండిపడ్డారు.  ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోడంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

New Update
kotha prabhakar reddy vs jaggareddy

kotha prabhakar reddy vs jaggareddy

 Jaggareddy:  ఇటీవల జరిగిన ఒక సమావేశంలో జగ్గారెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి తప్పు పట్టిన విషయం తెలిసిందే.  కమీషన్లలో వాటా ఇవ్వట్లేదనే జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ లో ఏడ్చారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారు.. నీవ్వెంతా.. నీ బతుకెంతా? అని మండిపడ్డారు.  ప్రభాకర్ రెడ్డి నా వెంట్రుకతో కూడా సరిపోడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదని జగ్గారెడ్డి అన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని చెప్పుకున్నారు. ప్రజల సమస్య వింటే నాకు వాళ్ళ కంటే ముందు ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ ఎక్కువగా పేదలు ఉంటారని జగ్గారెడ్డి చెప్పారు.

Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

 ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచే గుణం మా అమ్మనాన్న నాకు ఇచ్చిన ఆస్తి అని జగ్గారెడ్డి చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానని సవాలు విసిరారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు. నేను ఎలాంటి వ్యక్తినో  కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలని  ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడివయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.  

నేను ప్రభాకర్ రెడ్డిలాగా ప్యాకేజీ లీడర్ ను కాదని, కేసీఆర్ కు ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదన్నారు. నా క్యారెక్టర్ ఏమిటో ప్రభాకర్ రెడ్డికి కూడా తెలుసని అయినా ఎందుకు తొందరపడి మాట్లాడారు అని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి దగ్గరున్నంత ఆస్తి నా దగ్గరుంటే ఎప్పుడో రైతులకు పంచేవాన్నని అన్నారు. మా మంత్రులు వాటాలు పంచుకోవడం కాదు కనీసం జనాలకు ఏమైనా చేద్దామంటే ప్రభుత్వ ఖజానాలో బీఆర్ఎస్ ఏమి మిగిల్చిందని దుయ్యబట్టారు. దొంగలు మీరైతే నిందలు మా మీద వేస్తారా అని జగ్గారెడ్డి మండిపడ్డారు.  

కేసీఆర్ కుటుంబం అవినీతికి ప్రొఫెసర్లు అని ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుని నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ఆలీ బాబా 40 దొంగలకు కేసీఆర్ కుటుంబానికి తేడా లేదని ఎద్దేవా చేశారు. ఈ 40 మంది దొంగల్లో ప్రభాకర్ రెడ్డి కూడా ఓ దొంగ అని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలో లిక్కర్ దుకాణం తెరిచి  కేజ్రీవాల్ కథ ముగించేసిందని ఆరోపించారు. పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ దాకా రాత్రి 2 గంటల వరకు లిక్కర్, పబ్బు దందాలేనని జగ్గారెడ్డి ఆక్షేపించారు.  కేటీఆర్ బావమరిది సంతోష్ ఈ దందా సాగిస్తున్నాడని పోలీసులు చెప్పారని జగ్గారెడ్డి తెలిపారు. భూకబ్జాల్లో కేసీఆర్ కుటుంబం ఎక్స్ పర్ట్ అన్నారు. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్లలో 30 శాతం వేసుకున్నా రూ. 30 వేల కోట్లు తినేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులను లెక్కేసుకోవడానికే కేసీఆర్ తన దగ్గరకు ఎవరిని రానివ్వలేదని ఆరోపించారు.


Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

Advertisment
తాజా కథనాలు