Gram Panchayat Elections : తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్..

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలివిడత 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటు న్నారు.

New Update
FotoJet - 2025-12-11T111134.766

Gram Panchayat Elections

 Telangana Gram Panchayat elections : తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలివిడత 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.  ఓటర్లు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకుంటు న్నారు. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

595699372_2233574023790780_8386628121995367115_n

పోలింగ్ నేపథ్యంలో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొనగా కామారెడ్డిలోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు బ్రేక్ పడింది. జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

Whats_App_Image_2025_12_11_at_8_09_07_AM_3db0745fd1

పెద్ద గోకుల్ తండా వాసిని వేలం పాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నారని చిన్న గోకుల్ తండా వాసులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా చిన్న గోకుల్ తండా వాసులు ఓట్లు వేయకుండా తండాల్లోనే ఉండిపోయారు. తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయలని వారు డిమాండ్ చేస్తున్నారు.  

Whats_App_Image_2025_12_11_at_7_37_13_AM_b187f86b1f

కాగా ఎన్నికల్లో గెలవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తమ ప్రచార సరళి, ప్రలోభాలు ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకున్నాయన్న దానిపై సన్నిహితులు, అనుచరులను అడిగి తెలుసుకుంటున్నారు.

Whats_App_Image_2025_12_11_at_8_33_58_AM_5b3911b952

 ప్రచారం ముగియడంతో ఇక పూర్తిగా ప్రలోభాలపైనే దృష్టి సారించారు. అభ్యర్థులు ఈపాటికే సిద్ధంగా ఉంచుకున్న మద్యం, డబ్బు నిల్వలను బయటకు తీశారు. తమకు అత్యంత నమ్మకస్తుల ద్వారా డబ్బు పంపిణీని ప్రారంభించారు.

Whats_App_Image_2025_12_11_at_8_09_12_AM_6f805a8b9a

కొన్ని చోట్ల బుధవారం మధ్యాహ్నం నుం చే ప్రారంభం కాగా, ఎక్కువ చోట్ల బుధవారం అర్ధరాత్రి సమయంలో డబ్బు, మద్యం పంపిణీ సాగింది. పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలకు చిక్కకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం పంపిణీ చేశారు.

Whats_App_Image_2025_12_11_at_8_09_10_AM_76474e95c9

597965890_2233573433790839_8542708206554419311_n

Whats_App_Image_2025_12_11_at_8_33_50_AM_eb924652eb

Whats_App_Image_2025_12_11_at_7_38_13_AM_012653d3cf

597557266_2233573773790805_5565379756656076616_n

Whats_App_Image_2025_12_11_at_8_33_52_AM_15fccd324a

598180238_2233573987124117_1633506047656634447_n

Advertisment
తాజా కథనాలు