బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసిందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీనివాస్ ఇంటికి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నట్లు సమాచారం. ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఏర్రోళ్లపై పోలీసులు అనేక కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఏ క్షణం అయినా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పోలీసులు భారీ సంఖ్యలో రావడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నట్లు తెలుస్తోంది.