తెలంగాణలో ఉన్న ప్రభుత్వం యేడాదిగా నిర్వహిస్తున్న పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకే తాను వచ్చానని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అన్యాయం, అబద్ధాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తెలంగాణ బీజేపీ నడుం బిగించిందని చెప్పారు. దీని కోసం పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బీజేపీ నేతలపై హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు నడ్డా. తెలంగాణ బీజేపీ రైతులు, మహిళలు, యువకులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ సంపూర్ణాభివృద్ధి, మంచి భవిష్యత్తు బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ కేవలం తన అధాకారాన్ని వినియోగించుకుంటుంది కానీ.. బీజేపీ ప్రజా సమస్యల పరిష్కరానికి రాష్ర్ట అభివృద్ధికి పనిచేస్తుందని అన్నారు. 60యేళ్ల తరువాత మూడుసార్లు దేశంలో ప్రధానిగా ఎన్నికైన వారు మోదీయేనన్నారు. ప్రతిపక్షాలు ఎంత బలప్రయోగం చేసినా వారి పాచికలు పారలేదని మోదీ మూడోసారి ప్రధాని పీఠం ఎక్కారని చెప్పుకొచ్చారు నడ్డా.
తెలంగాణలో బీజేపీ రావాలి..
పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగిందన్నారు. 19 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. అలాగే తెలంగాణలోకి ఒక్కసారి బీజేపీ వస్తే ఇక పర్మినెంట్ గా ఉంటుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ కమలాన్ని వికసించాలని చెప్పారు నడ్డా. రాజస్థాన్ లో ఆరు, గోవా 3, మధ్యప్రదేశ్ లో 3, యూపీలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. ఉత్తరాఖండ్ లో లరెండో, మణిపూర్ లో మూడు, అసోంలో రెండు, హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు గెలుపురికార్డులు ఉన్నాయన్నారు.జమ్మూకశ్మీర్ లో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందన్నారు. ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో 64 సీట్లపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరగ్గా ఇందులో 62 స్థానాలను బీజేపీ గెలిచిందని నడ్డా చెప్పుకొచ్చారు. స్థానిక పార్టీలు గెలిపించిన స్థానాల్లోనే కాంగ్రెస్ గెలువగలుగుతుందని.. సొంతంగా గెలవలేరని విమర్శించారు. హిమాచల్, కర్ణాటక, తెలంగాణలోని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఆటోడ్రైవర్ కు రూ. 12వేలు ఇస్తామని మోసం చేశారని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పే మాయలోళ్లని అన్నారు. రేవంత్ రెడ్డి కూడా మాయమాటలు చెప్పేవాడేనని అన్నారు. వారి మీదనే భరోసా లేని వారు తెలంగాణఖు విద్యాభరోసా కార్డు హామీ ఇచ్చారని ఆ భరోసా ఏమైందన్నారు. నిరుద్యోగులకు భత్యం దొరకలేదన్నారు. రైతులకు రూ. 15వేలు ఏమైందని ప్రశ్నించారు. కౌలు రైతులకు రూ. 12వేలు అందిందా? అని ప్రశ్నించారు. అందుకే వీరిని తాను మాయలోళ్లని అంటున్నానని అన్నారు. మహిళలకు రూ. 2500 ప్రతీనెలా ఇస్తామని అన్నారని ఎవ్వరికైనా లభించిందా? అని ప్రశ్నించారు. షాదీ ముబారక్ ఒక తులం బంగారం, ఒక లక్ష రూపాయల నగదు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు వ్యాఖ్యల సిద్ధాంతాన్ని పాటిస్తుందన్నారు. ఎన్నిరోజులైతే అధికారంలో ఉంటామో అప్పులతో నడిపిద్దామని, ఆ తరువాత ప్రభుత్వాన్ని అడిగే వారె ఉండరని, ప్రభుత్వం మనుగడలో ఉంటుందో లేదో ? తెలియదనే విధానంలో ఉంటుందని నడ్డా విమర్శించారు.
తెలంగాణకు 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ 1.12 లక్షల గ్రాంట్లు, వరంగల్ కు రూ. 27 కోట్లు, టెక్స్ టైల్, రైల్వేకు 20 రెట్లు బడ్జెట్, వందేభారత్ మూడు వందేభారత్, ఐదు భారత్ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇండోర్, సూరత్ చెన్న, హైదరాబాద్ విశాఖపట్నం లాంటి జాతీయ రహదారులు, బీబీనగర్ లోనూ ఎయిమ్స్ నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని నడ్డా చెప్పారు. బీజేపీ హామీ ఇవ్వనివి కూడా ఇచ్చి చూపెడుతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక చతికిలపడుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ అవాస్తవాలపై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు .
Also Read: ముక్కలయ్యేందుకు సిద్ధంగా కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు