Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ రైలు

తెలంగాణ నుంచి మరో వందే బారత్ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ -నాగ్‌పుర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ రైలు నడవనుంది. సెప్టెంబర్ 15న ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Vande Bharat
New Update

Vande Bharat: తెలంగాణ, ఆంధ్రాల మధ్య ఇప్పటికే పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు నడుస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు మరో రైల్ సర్వీస్ తెలంగాణ నుంచి ప్రారంభం అవనుంది. సికింద్రాబాద్‌ -నాగ్‌పుర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ రైలు సర్వీసులంచేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్‌ రైళ్లు సేవలందిస్తుండగా..ఐదో రైలు ఇప్పుడు పరుగులు పెట్టనుంది.

సికింద్రాబాద్–నాగ్‌పూర్‌‌ స్టేషన్ల మధ్య మధ్య 578 కి.మీల దూరాన్ని కొత్త వందే భారత్ రైలు కేవలం ఏడు గంటల 15 నిమషాల్లోనే పూర్తి చేయనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ రైలు నాగ్‌పుర్‌లో ఉదయం 5 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.15గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. రాత్రి 8.20గంటలకు నాగ్‌పుర్‌ చేరుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రాపుర్‌, సేవాగ్రామ్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని కిషన్ రెడ్డి తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

#vande-bharat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe