Telangana News : అంతర్జాతీయ వేదికపై మన సర్వపిండి.. సకినాలు..త్వరలో బ్రాండింగ్

సర్వపిండి..సకినాలు..ఇవి తెలియని తెలంగాణ వారుండరు. తెలంగాణలో ఈ రెండు తినుబండరాలు చాలా ఫేమస్‌. అయితే వీటికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సర్వపిండి..సకినాలకు బ్రాండింగ్‌ కోసం కృషిచేస్తున్నారు.

New Update
FotoJet - 2025-11-23T075402.941

Telangana News : సర్వపిండి..సకినాలు..ఇవి తెలియని తెలంగాణ వారుండరు. తెలంగాణలో ఈ రెండు తినుబండరాలు చాలా ఫేమస్‌. అయితే ఈ తినుబండారాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం మేడ్చల్‌ జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులు తయారు చేస్తున్న సర్వపిండి..సకినాల తినుబండారాలకు బ్రాండింగ్‌ కోసం అధికారులు కృషిచేస్తున్నారు. 

 మేడ్చల్‌ జిల్లాలో 3,585యి. ఈ సంఘాల్లో 38,526 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం సంఘాల్లో అరవై శాతం సంఘాల సభ్యులు తినుబండారాలను తయారు చేసి సొంతంగా విక్రయిస్తున్నారు. లడ్డూలు, బూందీ, సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు ఇలా అన్ని తినుబండారాలను బెల్లంతో తయారు చేస్తున్నారు. ఇవే కాక చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, కొర్రలతోనూ స్వీట్స్‌ తయారు చేస్తున్నారు. చిరుధాన్యాలతోనే  బూందీ, కారప్పూస, మిక్చర్‌ను వినియోగదారులకు అందిస్తున్నారు. వీటికి బ్రాండింగ్‌ కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

వాటికి బ్రాండింగ్‌ దక్కాలంటే శుచిగా తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యత ధ్రువపత్రాలు వంటి అంశాలపై మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో కేరళలోని కుదుంబశ్రీ సంస్థ, హైదరాబాద్‌లోని నిథమ్‌ సంస్థలకు వారిని తీసుకువెళ్లి అక్కడి యంత్రాలతో పిండివంటలు, పచ్చళ్లు, పొడులు అత్యాధునిక పద్ధతుల్లో వేగంగా ఎలా తయారు చేయాలో నేర్పించారు. దీంతో ఇప్పుడు వీరు తమ ఉత్పత్తులపై భారత ఆహార నాణ్యత ప్రమాణాల అధీకృత సంస్థ ధ్రువపత్రాలను ముద్రిస్తున్నారు. దానితో పాటు మరోవైపు మార్కెటింగ్‌ వ్యూహాలు, బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు, రుణ సదుపాయాలు, విక్రయాల్లో లాభనష్టాలపై అవగాహన కల్పించేందుకు బిట్స్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. తదుపరి దశలో విక్రయాలు పెంచుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే రానున్న రోజుల్లో మన మన సర్వపిండి.. సకినాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చే అవకాశం ఎంతో దూరంలో లేదు.

Advertisment
తాజా కథనాలు