MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది.
TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు కోర్టు షాకిచ్చింది. జూన్ 21 వరకు ఆమె జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. తనకు జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు అడగగా.. కోర్టు అందుకు అనుమతించింది.
నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైంది. కామారెడ్డి - రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంప్ గ్రామంలో తెగిపడిన విద్యుత్ తీగలు తాకి షేక్ లతీఫ్(29) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్తంభాలు విరిగాయన్న విషయాన్ని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మరో కేసు నమోదు అయింది. చైతన్య రిసార్ట్స్ భూ వివాదంలో జీవన్‌రెడ్డిపై చీటింగ్, దోపిడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. సామ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మోకిలా పీఎస్‌లో కేసు నమోదు అయింది.
బాసర ఆర్జీయూకేటీ యూజీసీ ప్రవేశాలకు నోటిఫికెషన్ విడుదల అయింది. జూన్ 1 నుండి 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 సీట్లను భర్తీ చేయనుంది. జూలై 3 న సీట్ల కేటాయింపు, జూలై 8 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది.
TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్‌లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ లారీ దగ్దం కాగా.. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. భూమిని కబ్జా చేసాడంటూ బాధితుడు ఫిర్యాదు చేయడంతో జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి చెందిన మాల్.. బకాయిలు చెల్లించని కారణంగా ఆర్టీసీ అధికారులు ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ మాల్ ఎట్టకేలకు మళ్లీ తెరుచుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రీఓపెన్ అయ్యింది.