Nallamala Tour: సమ్మర్‌లో అదిరిపోయే టూర్.. నల్లమల్ల టూరిజం స్పెషల్‌ ప్యాకేజీ

పర్యటకులకు నల్లమల్ల టూరిజం గుడ్ న్యూస్‌ చెప్పింది. వేసవిలో పిల్లాపాపలతో ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ పెట్టింది. పచ్చని ప్రకృతి, 390 రకాల పక్షిజాతులు, చూడాలనుకుంటున్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
Nallamala forest

Nallamala forest

Nallamala Tour: నల్లమల్ల ఫారెస్టు అంటే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అక్కడి పచ్చని ప్రకృతి మధ్య కాసేపు సేద తీరితే.. మనసుకు చెప్పలేని ఆనంద, ఉత్సాహం వస్తుంది. చల్లని వాతావరణంలో అలా ప్రకృతి ఒడిలో రోజంతా ఎంజాయ్‌ చేస్తూ గడిపే క్షణాలు మధురానుభూతుల్ని ఇస్తాయి. అలాంటి ఆహ్లాదంగా గడిపేందుకు నల్లమల ఎప్పుడూ స్వాగతం చెబుతూనే ఉంటుంది. మరికొద్ది రోజుల్లో రాబోతున్న సమ్మర్ కోసం ఎంతో మంది ప్రకృతి పచ్చదనంతోపాటు జంతువుల నమూనాలు, వృక్ష సంపద, పెద్ద పులులు, చెంచుల జీవన విధానాలు చూసేందుకు సిద్దమైతారు. నల్లమల్లలో ఉంటే పచ్చిన ప్రకృతి,  390 రకాల పక్షి జాతులు, బెట్టు ఉడుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లను చూస్తూ సంతోషంగా గడపవచ్చు. నల్లమల సందర్శన, పర్యాటకుల సౌకర్యార్థం, వసతులకు సంబంధించి అటవీ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ప్యాకేజిని అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం.

 చూడాల్సిన ప్రదేశాలు:

  • ఆత్మకూరు మండలం బైర్లూటి, శిరివెళ్ల సమీపంలోని పచ్చర్ల దగ్గర ఎకోటూరిజం కేంద్రాలు, తుమ్మల బయలు, రోళ్లపాడులో సఫారీకి అవకాశం కల్పించారు. ఇక్కడికి వెళ్లాలంటే బైర్లూటి నుంచి 18 కి.మీలు అడవి ఒడిలో ప్రయాణిస్తూ.. చిత్రాలు, అటవీ పదార్థాలు కొనుగోలు చేయొచ్చు. 
  • జంగిల్‌ సఫారీ, ఎకోవాక్, హెరిటేజ్‌ వాక్,  ట్రెక్కింగ్, బర్డ్స్, బట్టర్‌ఫ్లై స్కౌట్ సౌకర్యవంతమైన ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు మంచి వసతులు ఉన్నాయి.
  • ఈ టూర్‌కి వెళ్లే వాళ్లు ముందుగా ఎన్‌ఎస్‌టిఆర్‌.కో.ఇన్‌ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. లాగిన్‌ కాగానే బైర్లూటి ఎకో టూరిజం, పచ్చర్ల, తుమ్మలబయలు, నెక్కంటి ఇష్టకామేశ్వరి, రోళ్ల పాడు అభయారణ్యం ప్యాకేజీల లీస్ట్ కనిపిస్తుంది. వాటిలో మీకు ఇష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు.

బస చేసేవారి కోసం..

  • బైర్లూటిలో 3 కాటేజీలు, 6 టెంట్లు, రెండు ఫ్యామిలి హౌస్‌లు, పచ్చర్లలో 4 కాటేజీలు, 2 టెంట్లు అందుబాట్లో ఉన్నాయి. 
    ఒకరోజు విడిదికి రూ.7 వేలు, ఆరేళ్లు పైబడిన పిల్లలు ఉంటే రూ.1500, ఫ్యామిలి హౌస్‌కు ఒకరోజుకు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 8 మంది వరకు ఉండేలా ఏర్పాటు ఉన్నాయి. ఉదయం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 వరకు ఇక్కడ ఉండానికి వీలు ఉంది. సఫారీ చేసే వారు ఒకసారి వాహనానికి 10 మందికి రూ.3 వేలు చెల్లించాలి. ఈ వివరాల గురించి పూర్తి తెలుసుకోవాలంటే.. WWW.NSTRలో లాగిన్‌ చేసి చూడొచ్చు.

కోరిన ఆహారం:

  • ఎకోటూరిజం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లు పర్యాటకులకు చక్కటి రుచులతో కోరిన ఆహారం ఉంటుంది. కాటేజీల ప్యాకేజీలో భాగంగానే ఆహారం లోటు లేకుండా అందిస్తున్నారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం చిరుతిళ్లు, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ అన్ని రకాల పదార్థాలు ఉంటాయి. మధ్యాహ్నం చక్కటి శాకాహారం, రాత్రి చికెన్‌తో భోజనం, అల్ఫాహారం  వంటికి  పెడతారు.

ఇది కూడా చదవండి: థైరాయిడ్ టాబ్లెట్స్‌ వేసుకున్నాక ఎన్ని గంటలు ఏమీ తినకూడదు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు