/rtv/media/media_files/2025/10/29/suryapeta-2025-10-29-18-27-08.jpg)
suryapeta
Montha Cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజులుగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో పెను విషాదం చోటుచేసుకుంది. మద్దిరాలకు చెందిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి బైక్ వెళ్తుండగా ఈదురుగాలులకు చెట్లు విరిగి మీద పడడంతో మృతి చెందాడు. లక్ష్మీ నారాయణ తానంచర్ల ఉన్న తన మెడికల్ షాప్ నుంచి తిరిగి మద్దిరాల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చెట్లు ఒక్కసారిగా అతడిపై కుప్పకూలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు లక్ష్మీ నారాయణ. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Gang Rape: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్
Follow Us