మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దయింది. దీని మీద హైకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇచ్చింది. 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్నవారే అర్హులని తేల్చి చెప్పింది. అంతకు ముందే సరైన అర్హతలు లేని కారణంగా 2012లో హైకోర్టు తీర్పు మేరకు 1200 మందిని తొలగించారు. కోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1207 చట్ట విరుద్ధమని.. కోర్టు తీర్పుల స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొంది. అలా తిరిగి తీసుకోవడం వల్ల మరిన్ని వివాదాలు తలెత్తుతాయని తెలిపింది. జీవోను సమర్థి్స్తే ప్రభుత్వం చేసిన తప్పునే ఈ కోర్టు మళ్లీ చేసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. 90 రోజుల్లో అర్హులతో కూడిన జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.