/rtv/media/media_files/cXAXRKcdbJKgYgR6kmSn.jpg)
Telangana Municipal Elections
Telangana Municipal Elections : మున్సిపల్ పోరులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోంది. పట్టణ ఓటర్లు ఏకపక్షంగా హస్తం వైపు మొగ్గు చూపారని తొలివెలుగు సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని సర్వే స్పష్టం చేసింది. అయితే, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే తెలిపింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి పట్టణాల్లో గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని, ఆ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోలేక జీరోకే పరిమితం కానున్నట్టు సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తుండగా, గులాబీ పార్టీ కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడినట్టు కనిపిస్తోంది.
కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లకు జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 15-18, బీజేపీ 25-27, బీఆర్ఎస్ 15-16, ఎంఐఎం 5-7, ఇతరులు 0-2 డివిజన్లు గెలిచే అవకాశాలున్నాయని తొలివెలుగు సర్వే అంచనా వేసింది. 2020 ఎన్నికల్లో బీఆర్ఎస్-33, బీజేపీ-13, కాంగ్రెస్-3, ఎంఐఎం-4, ఇతరులు-7 స్థానాల్లో గెలిచారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మేయర్ పదవి దక్కింది. ఈసారి హంగ్ వచ్చే అవకాశాలున్నప్పటికీ బీజేపీకే మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉన్నట్టు సర్వే పేర్కొన్నది. బండి సంజయ్ ప్రచారం బీజేపీకి కలిసొచ్చే అవకాశం. బీఆర్ఎస్ కార్పోరేటర్లపై అవినీతి ఆరోపణలు, గత పాలక మండలి అభివృద్ధి చేయలేదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 30-35, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 07-08, ఎంఐఎం 01-03, ఇతరులు 01-02 స్థానాల్లో విజయం సాధించవచ్చు. 2020 ఎన్నికల్లో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఉంది. తాజాగా కాంగ్రెస్‌కే మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవి దక్కే అవకాశం ఉన్నది. సీనియర్ నేత NPవెంకటేష్ కూతురు నేహాశ్రీకి పదవి దక్కే ఛాన్స్ ఉన్నది. వెంకటేష్ ఎమ్మెల్యే టికెట్, డీసీసీ పదవి ఆశించి భంగపడటంతో సానుభూతి కలిసిరానుంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, స్థానికంగా బలమైన కేడర్ ఉండటం, లాయర్‌గా స్థానికులకు సుపరిచితం కావటం ఆయనకు ప్లస్ గా మారింది. మేయర్ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ ప్రసన్న పేరు వినిపిస్తోంది. ఆయనకు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలో చాలా కాలంగా పనిచేయడం ఆయనకు కలిసొచ్చే అంశం. హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలు సైతం ఉన్నాయి.
నిజామాబాద్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 10-13, బీఆర్ఎస్ 0-5, బీజేపీ 20-22, ఎంఐఎం 15-17, ఇతరులు 0-3 గెలిచే ఛాన్స్ ఉంది. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్-2, బీఆర్ఎస్-13, బీజేపీ-28, ఎంఐఎం-16, ఇతరులు-1 డివిజన్లలో గెలిచారు. తాజాగా నిజామాబాద్ కార్పొరేషన్ లో హంగ్ వచ్చే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. అధికారంలో ఉండటం కాంగ్రెస్‌కి బలంగా మారింది. కాంగ్రెస్‌కి ఎంఐఎం సపోర్ట్ కలిసి రానున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ కు ప్లస్ గా మారాయి. బీజేపీకి ఎంపీ అర్వింద్ బలంగా ఉన్నారు. ఉనికి కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుండటం విశేషం.
మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 42-45, బీఆర్ఎస్ 09-10, బీజేపీ 00-03, ఇతరులు 0-1 విజయం సాధిస్తారని సర్వే అంచనా వేసింది. 2020 ఎన్నికల్లోకాంగ్రెస్-14, బీఆర్ఎస్-21, బీజేపీ-01, ఇతరులు-00 స్థానాలు గెలిచారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మేయర్ పదవి దక్కింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి దక్కనుందని సర్వే పేర్కొన్నది. 60 డివిజన్లలో మంచి నాయకత్వం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్లాన్ కాంగ్రెస్ కు బలంగా మారాయి. ప్రచారంలో బీఆర్ఎస్ వెనుకబడటం ఆ పార్టీకి మైనస్. మంచిర్యాల బీజేపీలో గ్రూప్ వార్ ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.
రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 30-35, బీఆర్ఎస్ 10-14, బీజేపీ 0-5, AIFB 12-15, ఇతరులు 3-5 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది.2020 ఎన్నికల్లో కాంగ్రెస్-11, బీఆర్ఎస్-19, AIFB-09, బీజేపీ-05, ఇతరులు-6 స్థానాల్లో గెలుపొందారు. అప్పుడు హంగ్ ఏర్పడటంతో బీఆర్ఎస్, AIFBతో కలిసి పాలకమండలి ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థికి మేయర్ పదవి దక్కింది. తాజాగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి దక్కనుందని సర్వే అంచనా వేసింది. రామగుండంలో కాంగ్రెస్ కేడర్ పటిష్టంగా ఉండటం, అధికారంలో ఉండడం ఆ పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది. కోరుకంటి చందర్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుని ఉండటం, హైడ్రా మోడల్ విస్తరణ కలిసొచ్చే అంశం.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లలో కాంగ్రెస్ 33-35, బీఆర్ఎస్ 10-11, సీపీఎం 00-01,సీపీఐ 08-10, ఇతరులు 00-03 గెలిచే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే మేయర్ పదవి దక్కగా, తాజాగా కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థికే మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉన్నదని సర్వే తెలిపింది. పొంగులేటి శ్రీనివాస్ అనుచరులకే పదవి దక్కనుంది. డా. బీఎస్ రావుకు మేయర్ పీఠం దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండటం, స్థానికంగా బలమైన కేడర్ ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు. 2020 ఎన్నికల్లోకాంగ్రెస్-1, బీఆర్ఎస్-25, సీపీఐ-8, ఇతరులు-2 స్థానాల్లో గెలుపొందారు.
నల్గొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 30-32, బీఆర్ఎస్ 8-10,బీజేపీ 0-4, MIM 0-2 స్థానాలు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్ ముందుగా మేయర్ అభ్యర్థిని ప్రకటించడం, మేయర్ అభ్యర్థికి స్థానికంగా మంచి పట్టు ఉండటం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
Follow Us