Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ!..అక్కడ కాంగ్రెస్!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  తాజాగా తొలి ఫలితం వెల్లడైంది. యాదగిరిగుట్టలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒకటో వార్డులో  బీజేపీ అభ్యర్థి బోడ రాధ విక్టరీ కొట్టారు.

New Update
BJP

BJP

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  తాజాగా తొలి ఫలితం వెల్లడైంది. యాదగిరిగుట్టలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒకటో వార్డులో  బీజేపీ అభ్యర్థి బోడ రాధ విక్టరీ కొట్టారు. కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వెలువడిన ఫలితాల్లో ఈ వార్డు ఫలితం మొదటిది కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ విజయంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ బోణీ కొట్టినట్లయింది.

కాగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపు 68-76 మున్సిపాలిటీలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిస్తోంది. సుమారు 29-36 మున్సిపాలిటీల్లో ఈ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 12వ వార్డులో బీఆర్ఎస్ విక్టరీ కొట్టింది. 

Advertisment
తాజా కథనాలు