/rtv/media/media_files/2025/02/25/tzTdac7dw8aIvV7Jd8ux.jpg)
Damodara Rajanarsimha
Damodara Rajanarsimha : జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ ముందుగా మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయన్నారు.హక్కుల సాధన కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది.ఈ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈరోజు నివాళులు అర్పించుకున్నాం.జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలకు, మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు.ఎన్ని తరాలైనా అమరుల రుణం తీర్చుకోలేనిదని మంత్రి అన్నారు.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
హక్కుల కోసం జరిగే పోరాటాలకు రాజకీయ రంగు పూయకూడదని, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వర్గీకరణ విషయంలో అదే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. మాదిగల పట్ల అది ఆయన నిబద్ధత, పేదల హక్కుల పట్ల చిత్తశుద్ధి అని చెప్పారు.సుప్రీంకోర్టు తీర్పునకు అనుకూలంగా, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేలా అన్ని విధాల అధ్యయనం చేసిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. అందులో వంకలు పెట్టడానికేం లేదు.వర్గీకరణపై అబద్ధాలు, మోసం, రాజకీయం కోసం విమర్శలు చేయొద్దని సూచించారు. త్వరలో వర్గీకరణ చట్టం చేస్తాం. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపడుతామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Also Read: రాజాసాబ్ కోసం స్టార్ కమెడియన్స్.. ఈసారి థియేటర్స్ దద్దరిల్లాలి
రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త చరిత్ర రాయబోతున్నాం. మీకు ఎక్కడ అవసరమున్నా, ఏ ఆపదున్నా ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిదని దామోదర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, వేముల వీరేశం, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, చంద్రశేఖర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు