Gandhi Bhavan : నేటి నుంచి గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి

TG: ఈరోజు నుంచి గాంధీభవన్‌లో ‘మంత్రులతో ప్రజల ముఖాముఖి’ కార్యక్రమం అమల్లోకి రానుంది. వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాల్లో మూడు గంటల పాటు గాంధీభవన్‌లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

New Update
Gandhi Bhavan

Congress Ministers: మాది ప్రజాపాలన అంటూ చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మంత్రులతో లేదా పార్టీ ముఖ్యనేతలు ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఈరోజు నుంచి ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. తనతో పాటు వారంలో కనీసం రెండు రోజుల పాటు మంత్రులు కూడా అందుబాటులో ఉంటారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు.

Also Read :  హైడ్రా బాధితులకు రేవంత్ శుభవార్త.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఇది ప్రజాప్రభుత్వం..

తెలంగాణ (Telangana) లో గత పదేళ్లుగా అరాచక పాలన చూసిన ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారని అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అందుకే ఫామ్ హౌస్ లో ఉండే ముఖ్యమంత్రి ని వద్దు అనుకోని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పగ్గాలను అప్పగించారని చెప్పారు. మాది ప్రజాప్రభుత్వం.. ఇది ప్రజల బాగు కోసం పని చేస్తున్న ప్రభుత్వం.. ఈ ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఆందోళనలు చేపట్టచ్చు.. గత ప్రభుత్వం లాగా అరెస్టులు ఉండవని అన్నారు. ప్రజలకు మరింత దగ్గర ఉండేందుకు గాంధీ భవన్ లో మంత్రులు, ముఖ్యనేతలు ఉంటారని చెప్పారు. ఎవరికీ ఏ సమస్య ఉన్న గాంధీ భవన్ లో డైరెక్ట్ గా మంత్రి ని కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు. అలాగే పార్టీ బలోపేతం చేసేందుకు కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులకు అండగా ఉండేందుకు తాము గాంధీ భవన్ లోనే ఉంటామని చెప్పారు.

మంత్రి దామోదరతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించనున్నారు. ప్రజా పాలన–ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా ఈరోజు ఉదయం 11 నుంచి 2 గంటల వరకు ప్రజలు, కార్యకర్తలతో జరిగే ముఖాముఖిలో దామోదరతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. కాగా నిన్న ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం  గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.

Also Read :  Paralympics విజేతకు గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి బహుమతిగా ఇచ్చిన సీఎం!

మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ ఇదే….

  • 25వ తేదీన – దామోదర రాజనర్సింహ
    * 27వ తేదీన – శ్రీధర్ బాబు
    * అక్టోబర్ 04వ తేదీన – ఉత్తమ్ కుమార్ రెడ్డి
    * అక్టోబర్ 09వ తేదీన – పొన్నం ప్రభాకర్
    * అక్టోబర్ 11వ తేదీన సీతక్క
    * అక్టోబర్ 16-వ తేదీన – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
    * అక్టోబర్ 18వ తేదీన కొండా సురేఖ
    * అక్టోబర్ 23-వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    * అక్టోబర్ 25 -వ తేదీన జూపల్లి కృష్ణారావు
    * అక్టోబర్ 30వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు

Also Read :  ఒంటిగంట వరకు ఫుడ్ స్టాల్స్..తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Advertisment
తాజా కథనాలు