Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం!

మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్‌ వాగులో కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

road accident
New Update

Road Accident: మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శివంపేట మండల పరిధిలోని రత్నాపూర్‌ వాగులో కారు బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, డ్రైవర్‌ గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులంతా రత్నాపూర్‌, పాముతండా, తాళ్లపల్లి వాసులుగా గుర్తించారు.

ప్రమాదంపై ఆరా..

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో కారు బాగా నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

పోలీసుల వివరాల ప్రకారం.. ఉసిరిక‌ప‌ల్లి దగ్గర వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టి కాలువలో పడిందని అంటున్నారు.  ఉసిరిక‌ప‌ల్లి నుంచి వెల్దుర్తి వ‌ర‌కు ర‌హ‌దారి ప‌నులు కొన‌సాగుతున్నందున ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘ‌ట‌నాస్థలంలో ఉన్న మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి త‌ర‌లించారు.




 ఇది కూడా చదవండి: ఈ ఆహారం తింటే గుండెపోటు అస్సలు రాదు

అతి వేగం కారణంగానే కారు వాగులోకి దూసుకెళ్లిందా.. ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు .మృతులంతా.. ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం అంతా విషదం నెలకొంది. ఈ ప్రమాదం కారు బ్రేకులు ఫెయిల్ అవడంతో జరిగిందా? లేక అతి వేగంతో సంభవించిందా? అన్నది తెలియాల్సి ఉంది

 ఇది కూడా చదవండి:  క్యాన్సర్‌లో ఎన్నిరకాలు ఏది ప్రాణాంతకం..?

#road-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe