అఘోరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ రోడ్లపై వీరంగం చేస్తుంది. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ మంగళగిరిలోని హైవే రోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. అక్కడ అఘోరి చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అడ్డొచ్చిన పోలీసులను తుక్కు తుక్కు కొట్టింది. పోలీసు కారులో మారం చేసింది. ఎవ్వరు ఎన్ని చెప్పినా వినలేదు. ఆమె చేసిన రచ్చకు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.
Also Read: చెల్లి ఫొటోతో ఎఫ్‌బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
ఇక ఇదంతా కాదని పోలీసులంతా కలిసి అఘోరిని ఒక వ్యాన్‌లో ఎక్కించి పట్టుకుపోయారు. అలా తీసుకెళ్లి బయట నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. అనంతరం వరంగల్ చేరుకున్న అఘోరి అక్కడ హల్ చల్ చేసింది. రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే కూర్చుంది. రాత్రంతా శ్మశాన వాటికలోనే ఉన్న అఘోరి.. అక్కడే శ్మశానంలోనే పూజలు చేసింది.
Also Read: ఇవి తింటే బరువు తగ్గడం కన్ఫామ్
అనంతరం శ్మశానంలో పడుకుంది. ఈ క్రమంలోనే అఘోరి మగవారితో మాట్లాడకుండా ఐదు రోజుల దీక్షలో ఉన్నట్లు తెలిసింది. అందువల్లనే కేవలం మహిళలతోనే ఆమె మాట్లాడుతుంది. మహిళలకు మాత్రమే భస్మంతో బొట్టు పెడుతుంది. అనారోగ్య సమస్యలున్న పలువురు భక్తులు అఘోరీ వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఘోరీని చూడటానికి శ్మశానానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు.
అఘోరి సంచలన నిర్ణయం
ఇకపోతే ఇప్పుడు అఘోరి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లోని రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలో ఉదయం నుంచి పూజలు చేసిన అఘోరీ ఇప్పుడు అక్కడ నుంచి మరో ప్రాంతానికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. వరంగల్ నుంచి నుంచి గుజరాత్‌కు అఘోరి బయలుదేరింది. ఇందులో భాగంగానే వరంగల్‌లో కారు రిపేర్ చేయించుకున్న అఘోరీ.. గుజరాత్‌కు పయణమైంది. గుజరాత్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటానని ఆమె తెలిపింది. అక్కడ సోమనాథ్‌తో పాటు మరిన్ని ఆలయాలను దర్శించుకోనున్నట్లు పేర్కొంది.