KTR: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది దిక్కుమాలిన గబ్బుమాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ హెచ్చరించారు. శుక్రవారం కందుకూరు రైతు ధర్నాలో పాల్గొన్న కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై త్వరలోనే కేసు పెడుతున్నట్లు చెప్పారు.
రేవంత్ కు నోటీసులు..
ఈ మేరకు కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే రేవంత్ కు నోటీసులు పంపిస్తా. ఆ మంత్రిని కూడా చట్టపరంగా వదిలేది లేదు. కొడంగల్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఇళ్లు నీటి కుంటలో ఉంది. రెడ్డి కుంట అనే కుంటలోనే ఉన్న రేవంత్ ఇళ్ళు కూల్చాలి. నీకు మాపై కక్ష ఉంటే మా ఇళ్లు కూడా కూల్చు కానీ.. పేదల ఇళ్ల జోలికి వెళ్లకు. సీఎం రేవంత్ రెడ్డి మీద పరువునష్టం దావా వేస్తా. ఇప్పటికే మంత్రి మీద పరువు నష్టం దావా వేశా. మరికొన్ని రోజుల్లోనే అందరి లెక్కలు తేలుస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కందుకూరు చౌరస్తాలో ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.