/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
KTR
రాష్ట్రంలో కొంతకాలంగా కేటీఆర్ అభిమానులు, అనుచరులు ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ వంటి పేర్లతో ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి వివిధ రకాల సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తన పేరు మీద ఎలాంటి సంస్థలను, సమితులను నడపడానికి తాను ఎవరికీ అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవన్నీ అనధికారిక సంస్థలని ఆయన తేల్చి చెప్పారు.
ఇప్పటికే తన పేరుతో కొనసాగుతున్న అన్ని రకాల సంస్థలు తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. ఇలాంటి సంస్థలకు పార్టీ పరంగా గానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి గుర్తింపు లేదని వెల్లడించారు. తనపై అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే, ప్రత్యేకంగా సంస్థలు పెట్టాల్సిన అవసరం లేదని కేటీఆర్ సూచించారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలన్నా, తనపై మద్దతు తెలపాలన్నా BRS పార్టీ వేదికగానే పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, పార్టీ జెండా కిందనే పని చేయడం ద్వారానే అసలైన అభిమానాన్ని చాటుకోవాలని ఆయన హితవు పలికారు.
ఈ ప్రకటనతో సొంతంగా గ్రూపులు కడుతున్న నేతలకు, అభిమానులకు కేటీఆర్ గట్టి సందేశాన్ని పంపినట్లయింది. వ్యక్తిగత ఇమేజ్ కంటే పార్టీ ప్రతిష్టే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Follow Us