KTR: అరెస్టుపై కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్..!

ఫార్ములా ఈ-కార్ రేస్‌ స్కామ్‌పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో అరెస్ట్ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు హబ్ గా హైదరాబాద్ ను నిలబెట్టేందుకు రేస్ నిర్వహించామని చెప్పారు.

author-image
By srinivas
New Update

KTR: ఫార్ములా ఈ-కార్ రేస్‌ స్కామ్‌పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో అరెస్ట్ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. 

లత్కోర్ ఆరోపణలు చేస్తున్నారు..

ఈ కారు రేసులో ఏమీ లేదు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తూ హంగామా చేస్తున్నారని అన్నారు. కళ్లలో కళ్లుపెట్టి సూటిగా చూసి చెప్పే ధైర్యం లేదని, ప్రజలకు నిజాలు చెప్పడానికే మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. ఇండియాలో కార్ రేసింగ్ హైదరాబాద్ తేవడానికి గత ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ సాధ్యం కాలేదన్నారు. ఇక ఇండియాలో పర్మినెంట్ ట్రాక్ కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నారని, చంద్రబాబు ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. కారు రేస్ కోసం గోపన్ పల్లిలో భూ సేకరణ చేపట్టగా.. ఆ భూమి ఇవ్వాలని రైతులు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి భూమి కూడా ఉందన్నారు. అఫిడవిట్ లో రేవంత్ నాకు చూపించారని కేటీఆర్ చెప్పారు. ఇక ఎఫ్ 1 రేస్ భారీ పాపులర్. సీటీల గ్రోత్ దాని చుట్టు ఉంటుందన్నారు. ప్రపంచ బిలినీయర్స్ మొత్తం ఆకర్షిస్తుందని, మోనాకో కార్ రేస్ వల్లే డెవలప్ అయిందన్నారు. మిలియన్ సంఖ్యలో ఈ రేసులు చూస్తారని, భారీ ఆదరణ పొందిందని చెప్పారు. 2009,10లో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జేపీ గ్రూప్ వారు ఇండియాకు పట్టుకొచ్చారు. యూపీ గవర్నమెంట్ 1700 కోట్లు ఖర్చు చేసింది. రెవిన్యూ కూడా వచ్చింది. భారత దేశంలో ఆ తర్వాత ఎక్కడా జరగలేదు. ఫార్ములా వన్ వారు ఇండియాకు రామని 2011 తర్వాత వెళ్లిపోయారని చెప్పారు.

అమిత్ షా గర్వకారణం అన్నారు..

ఇటీవల ఢిల్లీలో కారు రేసుపై అమిత్ షా కూడా గర్వకారణం అన్నారని గుర్తు చేశారు. తమిళనాడులో స్టాలిన్ ఫార్ములా 4 రేస్ నిర్వహించారని చెప్పారు. ఇక ఎలక్ట్రిక్ వెహికిల్స్ వచ్చిన తర్వాతే ఫార్ములా ఈ-రేసింగ్ మొదలైందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2014లో కారు రేసులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. భవిష్యత్తు తరాల కోసం ఎలక్ట్రిక్ వెహికిల్ రావాలని కోరుకున్నాం. ఫార్ములా ఈ రేసు ఇందులో భాగంగానే ఆహ్వానించాం. 2001లో చంద్రబాబు జినోమ్ వ్యాలీ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రమైంది. ఇప్పుడు ఫలాలు అందుతున్నాయి. అలాగే కేసీఆర్ నాయకత్వంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రవేశపెట్టాలని భావించాం. హైదరాబాద్ ను ప్రపంచపటంలో ఎలక్ట్రిక్ వేహికిల్స్ కు కేరాఫ్ హైదరాబాద్ గా నిలపాలనుకున్నామని చెప్పారు. 4 సీజన్లకోసం సైన్ చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డగా హైదరాబాద్ ఉండాలని ఆలోచించాం. ఇది భారత దేశం ఈవెంట్.. తెలంగాణది మాత్రమే కాదు. 2023 మరోసారి వారితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. 50 కోట్ల మంది చూసే రేస్ ప్రకటనల కోసం కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం. అన్నీ క్లియర్ గా రాసుకున్నాం. కోర్టులు, కేసుల వివరాలు కూడా ముందే రాసుకున్నాం. హ్యూండాయ్ 1400 కోట్లు, ఇతర కంపెనీలతో పలు ఒప్పందాలు జరిగాయని చెప్పారు.

700 కోట్ల ఆదాయం.. 

ఇక కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇది నడుస్తున్నట్లు బీజేపీ వాళ్లు బిల్డప్ ఇచ్చారని సెటైర్ వేశారు. బాంబేలో కూడా ప్రచారం నిర్వహిస్తే వారు కూడా కార్ రేస్ ఈవెంట్ కావాలని అడిగారని చెప్పారు. hmda చట్టంలో ప్రమోట్ చేయడంలో అధికారం ఉందని రాసి ఉంది. అప్పుడు మున్సిపల్ మంత్రిగా నాకు అర్హతలున్నాయి. 35 కోట్లు ఖర్చు చేశాం. గ్రీన్ కో స్పాన్సర్ 100 కోట్లు ఖర్చు చేసింది. నెల్సన్ సంస్థ ఈ రేసు వల్ల నగరానికి 82 మిలియన్ డాలర్ల్ ఎకానామికి బెన్ ఫిట్ వచ్చిందని రిపోర్టు ఇచ్చింది.  మొత్తం రూ.150 కోట్లు పెడితే 82 మిలియన్ డాలర్లు (700 కోట్లు) ఆదాయం వచ్చింది. రూ. 550 కోట్లు బెన్ ఫిట్ వచ్చింది. 2023లో ఎలక్షన్ బిజీ ఉండటం వల్ల  పట్టించుకోలేదు. కానీ అర్వింద్ కుమార్ మాతో చర్చించారు. మళ్లీ గవర్నమెంట్ మనదే వస్తదనే నమ్మకంతో ఎలన్ మస్క్ ను కూడా తీసుకురావాలనుకున్నాం. టెస్లాను కూడా హైదరాబాద్ ను తీసుకురావాలని ప్లాన్ చేశాం. 2023 ఆగస్టు 3 లోపల కార్ రేస్ నిర్వాహకులు కావాలంటే చెప్పాలని కండీషన్ పెట్టారు. దీంతో అర్వింద్ కుమార్ రెండు దఫాలుగా 5 అక్టోబర్ 2023 25శాతం కట్టారు. అక్టోబర్  11 రెండోసారి ఇన్  స్టాల్ మెంట్స్ చెల్లించాం. అక్టోబర్ 19నాడు స్టేట్ మెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ ఒకే అయిందని చెప్పారు. 

190 దేశాలు ఈ రేస్ ఈవెంట్ చూశాయి..

బీఆర్ఎస్ ఓటమి తర్వాత డిసెంబర్ 7నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే.. ప్రమోటర్ డిసెంబర్ 13నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో రేవంత్ పాజిటివ్ గా స్పందించినట్లు తెలిసింది. అల్బర్టో డిసెంబర్ 19న దాన కిశోర్ కు లేఖ రాశారు. వచ్చే మూడేళ్లలో ఫార్ములా ఇక్కడ నిర్వహించాలని కోరుతున్నామని వివరించారు. కానీ రేవంత్ మూడో సారి డబ్బులు చెల్లించకపోవడంతో క్యాన్సిల్ అయిందని చెప్పారు. కుదిరితే నాలుగు రోజులు టైమ్ ఇవ్వగలమని ఫార్ముల డైరెక్టర్ రేవంత్ గవర్నమెంట్ కు పంపించారు. అయినా వీరు స్పందించకపోవడంతో డబ్బులు వాపస్ తీసుకోమని కూడా చెప్పారని తెలిపారు కేటీఆర్. ఇక 190 దేశాల్లో ఈ రేస్ చూశారని చెప్పారు. 

మా వెంట్రుక కూడా పీకలేవు..

ఇక ఏసీబీ కేసు ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావట్లేదని కేటీఆర్ అన్నారు. ఏసీబీ రావడానికి అక్కడ కరెప్షన్ ఏమీ జరగలేదన్నారు. రేవంత్ ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తోంది. డబ్బులు రేస్ నిర్వాహకులకు ముట్టినాయి. కాంగ్రెస్ వల్లే రేస్ తిరిగి వెళ్లిపోయింది. ఇండియా ఇజ్జత్ తీశాడు రేవంత్. మా వెంట్రుక కూడా పీకలేడు. నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తామంటే చేసుకో. మా వెంట ఎందుకు పడుతున్నావో తెలుసు. మీ సీక్రెట్స్ బయటపెట్టినందుకే ఇలా చేస్తున్నావని తెలుసని అన్నారు కేటీఆర్.  

రాజకీయ కక్షతోనే అరెస్టులు..

ఇక సీఎం రేవంత్ రెడ్డి కుట్రతోనే 28 కుటుంబాలను క్షోభకు గురిచేశారని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుపాలు చేశారని, తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కావాలనే ఇరికించారన్నారు. కొండగల్ లో రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆరోపించారు. ఎఫ్ ఐఆర్ లేకుండానే బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా మొదట లగచర్ల రైతుల గురించి మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ చరిత్రలో ఇదొక దుర్మార్గపు చర్యగా నిలిచిపోతుందన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ధైర్యం కోల్పోకుండా జైలులో ఉన్నారని, ముందు రైతులను విడిపించాలని కోరినట్లు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు