Raj Pakala Arrest : జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా ఈరోజు పోలీసుల నోటీసుల నేపథ్యంలో మోకిల పీఎస్‌కు ముందుకు విచారణకు రాజ్‌పాకాల హాజరు కావాలి. మధ్యాహ్నం 12 గంటలకు పీఎస్‌లో హాజరు కావాలి. తన అడ్వకేట్‌తో పాటుగా విచారణకు రాజ్ పాకాల రానున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Also Read : ఈ రకమైన వ్యవసాయంతో రైతే రాజు
ఫాంహౌజ్ పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సోమవారం విజయ్ మద్దూరి విచారణకు హాజరు కాలేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో సోదాలు చేశారు. తన ఫోన్ ఇవ్వకుండా మహిళ ఫోన్‌ను పోలీసులకు విజయ్ మద్దూరి ఇచ్చాడు. విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ సీజ్ చేసేందుకు పోలీసులు వచ్చారు.
Also Read : ఆస్తుల వివాదం.. జగన్ సంచలన వ్యూహం!
శనివారం రాత్రి మొదలైన రచ్చ..
శనివారం రాత్రి జన్వాడలోని ఓ ఫామ్ హౌజ్ పై పోలీసులు దాడులు చేశారు. అక్కడ రేవ్ పార్టీ నిర్వహించారంటూ వార్తలు రావడం సంచలనంగా మారాయి. దీంతో పాటు ఓ ప్రముఖ నాయకుడికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం కూడా సాగింది. ఈ విషయంపై డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేశారు. రాజ్‌పాకాల, శైలేంద్ర పాకాల నివాసాల్లో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎందుకు సోదాలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే సోదాలు ఆపాలన్నారు.
Also Read : ఆ ఊరిపై పగబట్టిన పాము.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు!
కుట్రలతో గొంతు నొక్కలేరన్న కేటీఆర్..
కేటీఆర్ సైతం ఈ అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటుంటే రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. కుట్ర ఆ పార్టీలో వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు అన్ని వయస్సు వారు ఉన్నారన్నారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్కడ ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులే చెప్పారన్నారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
Also Read : రక్తదానంతో ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది!