పదేళ్ల క్రితం కూడా ఇలానే వార్తల్లో నిలిచిన కొండా సురేఖ.. అప్పుడు ఏమైందంటే?

కొండా సురేఖ 2009-14 మధ్యలో కూడా నిత్యం వార్తల్లో నిలిచారు. జగన్ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను ఆమె త్యాగం చేశారు. తెలంగాణ ద్రోహి అన్న ఆరోపణలను ఆ సమయంలో ఎదుర్కొన్నారు సురేఖ. ప్రస్తుతం సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.

Konda Surekha politics
New Update

కేవలం తెలుగు రాజకీయవర్గాల్లోనే కాదు సినీ సర్కిల్స్ లోనూ ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న పేరు కొండా సురేఖ. సమంత, నాగచైతన్య విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఇప్పుడు చర్చల్లో నిలిచారు. గత పదేళ్లుగా దాదాపుగా సైలెంట్ గా ఉన్న సురేఖ ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ అయ్యారు. 2009-2014 మధ్యలో కూడా ఆమె పదే పదే వార్తల్లో నిలిచారు.  ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కొండా సురేఖను మంత్రివర్గంలోకి తీసుకున్నారు వైఎస్. అయితే.. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే హెలిపాప్టర్ ప్రమాదంలో ఆయన దుర్మరణం పొందారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. ఇదే సమయంలో జగన్, కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ సమయంలో జగన్ కు మద్దతుగా నిలిచారు సురేఖ. ఎన్ని హెచ్చరికలు వచ్చినా వినకుండా జగన్ ఓదార్పు యాత్రను ఉమ్మడి వరంగల్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబాబాద్ లో సురేఖ, ఆమె భర్త మురళి, ఇతర కాంగ్రెస్ నేతలపై రాళ్ల దాడి జరిగింది. దీంతో జగన్ తన యాత్రను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కేసీఆర్, హరీశ్‌ రావుపై సురేఖ మాటల దాడి చేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.

 

తెలంగాణ ద్రోహి అని ముద్ర..

దీంతో కొండా సురేఖపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర కూడా పడింది. ఆ తర్వాత పరిణామాలతో ఆమె మంత్రి పదవిని సైతం కోల్పోయారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో జగన్ కు మద్దతుగా రాజీనామా చేసి సంచలనం సృష్టించారు సురేఖ. దీంతో అక్కడి ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ హరీశ్ రావును ఇన్‌ఛార్జిగా నియమించి సర్వశక్తులు ఒడ్డింది. హోరాహోరీగా జరిగిన ఆ ఉప ఎన్నికల్లో కేవలం వేయి ఓట్ల తేడాతో సురేఖ ఓటమిపాలయ్యారు. ఓటమి పాలైనా.. ఆమె నిత్యం వార్తల్లో నిలిచారు. ఓ దశలో వైసీపీ తెలంగాణ శాఖకు ఆమెను అధ్యక్షురాలిగా చేస్తారన్న ప్రచారం సాగింది. కానీ జగన్ తో విభేదాల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.

2018 తర్వాత సొంతగూటికి..

ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ లో చేరి 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. ఆ సమయంలో సురేఖ మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. దీంతో 2018 వరకు ఆమె ఎమ్మెల్యేగానే కొనసాగారు. చివరికి 2018లో టీఆర్ఎస్ పార్టీ ఆమెకు టికెట్ కూడా నిరాకరించింది. దీంతో మళ్లీ సొంతగూటికి చేరారు. ఆ ఎన్నికల్లో పరకాల నుంచి బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అంతా కొండా సురేఖ పని అయిపోయిందుకున్నారు. కానీ.. సురేఖ దంపతులు మాత్రం వెనక్కి తగ్గకుండా రాజకీయాలు కొనసాగిస్తూ వచ్చారు.

అయితే.. రెండు టికెట్లు ఆశించిన కొండా ఫ్యామిలీకి ఒకటి కూడా దక్కడం కష్టమన్న ప్రచారం కూడా సాగింది. చివరికి తమ సొంత సీటు పరకాలను వదులులకుని వరంగల్ తూర్పు నుంచి బరిలోకి దిగారు సురేఖ. ఆ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్న తర్వాత సురేఖ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కడంతో సురేఖ ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. కేసీఆర్, హరీశ్ రావు ప్రతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా కూడా ఆమె బాధ్యతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల దుబ్బాక పర్యటకు వెళ్లిన సమయంలో ఎంపీ రఘునందన్ రావు సురేఖకు దండ వేసిన ఫొటోను బీఆర్ఎస్ నేతలు ట్రోలింగ్ చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో సమంత, నాగచైతన్య విడాకులను కేటీఆర్ కు లింక్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సురేఖ.

#konda-surekha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe