ACB Raids : ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ.. ఎలా చిక్కాడంటే?
ఏసీబీ వలకు మరో అవినీత అధికారి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.లక్ష లంచం అడిగిన అశ్వరావుపేట ఏఈని ఏసీబీ వల వేసి పట్టుకుంది.
ఏసీబీ వలకు మరో అవినీత అధికారి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.లక్ష లంచం అడిగిన అశ్వరావుపేట ఏఈని ఏసీబీ వల వేసి పట్టుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ మద్దికొండ గ్రామ రైతు దగ్గర లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా బోకకల్లో వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొని ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నికల జరగనుంది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటింగ్ లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని భద్రాచలం పట్టణం తాతగుడి సెంటర్ పోలింగ్ బూత్ 136లో ఇంకా మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. సాంకేతిక కారణాలతో ఈవీఎం మొరాయిస్తుండడంతో.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. చేరుకున్న టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు చర్ల మండల వ్యాప్తంగా 36 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 60 శాతం పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో బోల్తా పడిన ఇన్నోవా కారులో నోట్ల కట్టల బ్యాగులు బయటపడ్డాయి. ఎన్నికలకు కొన్ని గంటల ముందు నోట్ల కట్టలు బయటపడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.