cock missing case: కోడిని కోశావా.. కోడి మిస్సింగ్ కేసులో వ్యక్తికి పోలీసుల థర్డ్ డిగ్రీ

కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేటలో కోడి మిస్సింగ్ కేసులో పోలీసులు నిందితున్ని చిత్రహింసలకు గురిచేశారు. విచారణ పేరుతో స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలు పెట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. నారావారిగూడెంలో అప్పారావ్ పందెంకోడి పుంజు కనిపించడంలేదని ఫిర్యాధు చేశాడు.

New Update
cock missing case

cock missing case Photograph: (cock missing case)

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అమానుష ఘటన వెలుగు చూసింది. పోలీసులు పందెంకోడి మిస్సింగ్ కేసులో విచారణ పేరిట స్టేషన్‌కు పిలిచి ఓవ్యక్తిని చిత్రహింసలకు గురిచేశారు. ప్రస్తుతం బాధితుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. నేరం ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Also read : Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్

అశ్వారావుపేట మండలం నారావారిగూడెంకు చెందిన దాసరి అప్పారావ్ ప్రేమగా పెంచుకుంటున్న బీడర్ పందెంకోడి పుంజు కనిపించడం లేదని పోలీసులకు ఫిబ్రవరి 22న ఫిర్యాధు చేశాడు. ఇంటిపక్కనే నివాసముంటున్న కలపాల నాగరాజు కారణమంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో అప్పారావ్ ఫిర్యాదు మేరకు నిందితుడు నాగరాజును ఎస్సై రామ్మూర్తి స్షేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టాడు. అతను పందెం కోడిని దొంగలించలేదని ఎంత చెప్పినా వినకుండా నేరం ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురి చేశాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

Also read: singer kalpana: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్‌

నిందితుడు నాగరాజు పోలీసుల దెబ్బలకు తాళలేక నడవలేని స్థితిలో సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మెరుగైన వైద్యం కోసం కుంటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పందెంకోడి కేసు విషయంలో నాగరాజును విచారించి పంపించామని పోలీసులు చెబుతున్నారు. తాము నాగరాజును చిత్రహాంసలకు గురిచేయలేదని అంటున్నారు. అరెస్ట్ చేస్తామన్న భయంతో నిందితుడు తమపై అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నాడని పోలీసులు చెప్పుకొస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు