Gold Saree: బంగారంతో చీర.. రేటు ఎంతో తెలుసా?

సిరిసిల్ల చేనేతల వస్త్రాలకు దేశంలోనే కాదు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేసి చేనేత కార్మికుడు విజయ్‌కుమార్‌ రికార్డ్‌ సాధించారు. ఈ చీర బరువు 800 నుంచి 900 గ్రాములు ఉండగా.. రూ.18 లక్షలు ఖర్చు అయిందని వ్యాపారి తెలిపారు.

New Update
gold saree

TG News: సిరిసిల్ల చేనేతల ప్రతిభ అంతాఇంతా కాదు.. దేశంలోనే కాదు విదేశాల్లో సైతం మన చేనేతల వస్త్రాలకు మంచి డిమాండ్‌ ఉంది. బతుకమ్మ చీరలను సైతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నేతన్నలకే అప్పగించింది. ఆరడుగుల చీరను అగ్గిపెట్టెలో మడతపెట్టేలా తయారు చేయడం మన వారి స్పెషాలిటీ. ఎన్నో కళాఖండాలు సృష్టిస్తూ అందరితో శెభాష్‌ అనిపించుకున్నారు మన నేతన్నలు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత ఓ అద్భుతాన్ని సృష్టించారు. 200 గ్రాముల బంగారంతో చీర తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు. సిరిసిల్ల టౌన్‌కు చెందిన నల్ల విజయ్‌కుమార్‌ ఈ రికార్డ్‌ సాధించారు.

హైదరాబాద్ వ్యాపారి ఆర్డర్..

హైదరాబాద్‌ నుంచి ఓ వ్యాపార వేత్త తనకు బంగారంతో చీర తయారు చేసి ఇవ్వాలంటూ విజయ్‌కుమార్‌కి ఆరు నెలల క్రితం ఆర్డర్‌ ఇచ్చాడు. దీంతో పని మొదలుపెట్టిన విజయ్‌కుమార్‌ 12 రోజుల్లో బంగారాన్ని జరి తీసి కొత్త డిజైన్‌ను సిద్ధం చేశాడు. సాధారణ చీరల్లా కాకుండా ఇది 49 ఇంచుల వెడల్పు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఐదున్నర మీటర్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు.

దీని బరువు కూడా 800 నుంచి 900 గ్రాముల వరకు ఉందని చేనేత చెబుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వచ్చేనెల 17న తన కూతురి వివాహం కోసం ఈ చీరను ప్రత్యేకంగా తయారు చేయించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా చీరకు రూ.18 లక్షలు ఖర్చు అయిందని వ్యాపారి అంటున్నారు. తన ముద్దుల కూతురికి బంగారంతో ఇలా చీరను చేయించడం ఎంతో సంతోషంగా ఉందని, కష్టపడి చీరను తయారు చేసిన విజయ్‌కుమార్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు