/rtv/media/media_files/2025/10/22/big-shock-to-naveen-yadav-2025-10-22-17-51-52.jpg)
Big Shock To Naveen Yadav
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భార్య కాదంటూ ఆయన మొదటి భార్య కుమారుడు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ పై బీఆర్‌ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్దేశిత కాలమ్స్ లో వివరాలు నింపకుండా తప్పులు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా బీఆర్‌ఎస్ ఫిర్యాదుతో నవీన్ యాదవ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి పరిశీలిస్తున్నారు.
కాగా ఫామ్ 26 లోని మొదటి మూడు పేజలలో ఉన్న కాలమ్స్ విషయంలో అభ్యంతరాలున్నాయని బీఆర్‌ఎస్ అంటోంది. ఇదే కారణంతో పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు అని రిటర్నింగ్ అధికారి దృష్టికి తెచ్చిన బీ ఆర్ ఎస్ తరపున న్యాయవాది . అలాంటపుడు నవీన్‌యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎలా ఒకే చేస్తారని ప్రశ్నించారు. దీనిపై రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారుల సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Follow Us