Staff Nurse Notification: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఈ నెల 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నవంబరు 17న నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా 13 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగబోతుంది. రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుందని అధికారులు తెలియజేశారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లు ఉండగా తాజాగా 46 ఏళ్లకు పెంచినట్లు అధికారులు వివరించారు. గరిష్ఠ వయోపరిమితికి ప్రాతిపదిక తేదీ 2024 ఫిబ్రవరి 8. గరిష్ఠ వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
Also Read: Bhadrachalam: భద్రాచలం ప్రధాన అనుచరుడిపై వేటు.. కోడలి పై లైంగిక వేధింపులు!