HYDRA: హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. కూల్చివేతలపై సీఎం రేవంత్ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం అని పేర్కొంది. చట్టబద్ధమైన అనుమతులుంటే భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. చెరువులకు దగ్గరుంటే కూల్చివేస్తారని ఫేక్ ప్రచారం జరుగుతోందని.. అనుమతులు ఉంటే కూల్చివేయం అని చెప్పింది. అనుమతులు ఉన్న భవనాలను కూల్చివేయబోమని సీఎం చెప్పారని... సీఎం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాం అని వివరించింది.
ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!
ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు
హైడ్రాపై సీఎం రేవంత్..
హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా తీరుపై ప్రశ్నించిన వాళ్లపై అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ వద్ద శనివారం రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ వల్లే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉందంటూ విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!
రాష్ట్ర ఆర్థిక మూలలను దెబ్బ తీయాలని కొంతమంది కుట్రకు పాల్పడుతున్నారని, రియల్ ఎస్టేట్ సంస్థలు భయపడొద్దని వారికి అండగా ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు. హైడ్రా ఆగదని.. అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదంటూ పేర్కొన్నారు. హైడ్రా అనగానే హరీశ్, కేటీఆర్ బయటకు వచ్చి.. పేదలకు మేలు జరగడానన్ని చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. మూసీలో మగ్గిపోతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
ఇది కూడా చదవండి:తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్