మా ఇల్లు ముట్టుకోవద్దు.. అధికారులను పరిగెత్తించిన మూసీ నిర్వాసితులు!

మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను అడ్డుకున్న స్థానికులు అధికారుల చేతుల్లో నుంచి పత్రాలను లాక్కున్నారు. గోడలపై మార్క్ కూడా చేయనివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెళ్లిపోయారు.

author-image
By Nikhil
New Update

హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చేపట్టిన సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. కొందరు నిర్వాసితులు అధికారుల దగ్గర నుంచి సర్వే పత్రాలను లాక్కొని చించేశారు. అధికారులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గోడలకు మార్క్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో కొత్తపేట, మారుతినగర్‌, సత్యానగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అధికారులు సర్వే నిర్వహించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇళ్లు ఖాళీ చేయం..

తాము ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానికులు చెబుతున్నారు. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లను అధికారులు ఇష్టారీతిన నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని.. ఎంత పెద్ద వర్షం వచ్చినా తమ కాలనీల్లోకి నీళ్లు రాలేదని చెబుతున్నారు. వరదలు వచ్చినట్లు తమ తండ్రులు, తాతలు కూడా చెప్పలేదని అంటున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు