అధికారుల వెనుక ఉన్న నేతలను కూడా వదిలిపెట్టం.. RTV ఇంటర్వ్యూలో రంగనాథ్

నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామని HYDRA చీఫ్ రంగనాథ్ తెలిపారు. విచారణలో వారి వెనుక ఎవరైనా నేతలు ఉన్నట్లు తేలితే వారిని కూడా విడిచిపెట్టమన్నారు. RTV అన్సెన్సార్డ్ ఇంటర్వ్యూలో హైడ్రాకు సంబంధించి అనేక అంశాలపై రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

author-image
By Nikhil
HYDRA Ranganath
New Update

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారి జోలికి ప్రస్తుతం తాము వెళ్లడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసి వ్యాపారాలు చేస్తున్న వారే తమ టార్గెట్ అని అన్నారు. ఈ రోజు RTV అన్‌సెన్సార్డ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. హైడ్రా కార్యకలాపాలపై వ్యక్తం అవుతున్న సందేహాలను RTV వేదికగా ఆయన నివృత్తి చేశారు. హైడ్రాకు చట్టబద్ధత లేదంటూ వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. హైడ్రా జీవో ద్వారా ఏర్పాటైందన్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్, ఏసీబీ లాంటి సంస్థలు సైతం జీవో ద్వారానే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.

పేదలను ముందు పెట్టి ఆక్రమణలు

కొన్ని చోట్ల పేదలను ముందు పెట్టి కొందరు ఆక్రమణలు చేస్తున్నారనన్నారు. ఆ క్రమంలోనే వారి నివాసాలను తొలగించామన్నారు. రాంనగర్ నాలాపై చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆ ఆదేశాలను తాము అమలు చేశామన్నారు. సున్నం చెరువు ఆక్రమణల విషయంలోనూ ఇలానే చేశామన్నారు. చెరువులను కబ్జా చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిన్న హైకోర్టు వ్యాఖ్యానించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తాము ఇప్పుడే పని ప్రారంభించామని.. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా హైడ్రా మరింత బలోపేతం జరుగుతుందన్నారు.

దుండిగల్ లో తాము ఇటీవల తాము చేపట్టిన కూల్చివేతలు చేపట్టిన నిర్మాణాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చాడన్నారు. అది చెల్లదన్నారు. కొన్ని చోట్ల పాత డేట్లతో సర్పంచ్ లు అనుమతులు ఇచ్చినట్లు దొంగ పేపర్లు సృష్టిస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. చెరువులు, ఇతర ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వాటిని విక్రయించి.. అమాయక ప్రజలను మోసం చేస్తున్న బిల్డర్లపై సైతం కేసులు పెడతామన్నారు. రూల్స్ పాటించకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేస్తున్నామని.. వారి వెనక రాజకీయనాయకులు ఉన్నట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు.

కూల్చివేతలు రాత్రికి రాత్రే చేయమని.. దాని వెనక చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఉంటుందన్నారు. అన్ని కోణాల్లో వివరాలు సేకరించిన తర్వాతనే కూల్చివేతలు చేపడుతున్నామన్నారు. మాదాపూర్ లో ఓ చెరువు మొత్తాన్ని మాయం చేసి నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాను శాటిలైట్ ఇమేజ్, పాత విలేజ్ మ్యాప్ లు తదితర మార్గాల ద్వారా సేకరిస్తున్నామన్నారు. హైడ్రాకు నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీళ్లు తీసుకెళ్లే నాలాలను సైతం ఇష్టం వచ్చినట్లుగా డైవర్ట్ చేశారన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైతం సేకరిస్తున్నామన్నారు.

#hydra
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe