Telangana Government:
డీఎస్సీ 2008 బాధిత అభ్యర్ధులకు ఎట్టకేలకు మరో అకాశం లభించింది. కాంట్రాక్ట్ ప్రతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులను సమర్పింంచాలని.. పాత జిల్లాల ప్రకారం వెరిఫికేషన్, విల్లింగ్ ఫామ్ ఇవ్వాలని చెప్పింది. అభ్యర్థులు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది విద్యాశాఖ. దీనికి సబంధించి 30 శాతం రిజర్వేషన్ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది.ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది. ప్రస్తుతం తెలంఆణ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లాభం చేకూరనుంది. దాంతో పాటూ డీఎస్సీ అభ్యర్థుల 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది.