HYD: రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఫైన్..సీరియస్ అయిన రెరా హైదరాబాద్‌లోరెండు రియల్ ఎస్టేట్ సంస్థపై రెరా కొరడా ఝళిపించింది. చెప్పిన సమయానికి ఫ్లాట్స్ కట్టించి ఇవ్వనందుకు ఫైన్ వేసింది. తమ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే విల్లాలు అమ్మిన మహా హోమ్స్ సంస్థకు రూ.6,58,226 జరిమానా విధించింది. By Manogna alamuru 17 Dec 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో రెఆ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ఇష్టం వచ్చినట్టు కొనగోలుదారులను మోసం చేస్తామని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. తాజాగా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యలు తీసకుంది రెరా. తమకు చెప్పిన సమయం కన్నా నిర్మాణం ఆలస్యం చేయడంతో పాటు అనేక ఉల్లంఘనలకు పాల్పడిందంటూ మహా హోమ్స్ సంస్థపై ‘రెరా’కు 13 మంది ఫ్లాట్ల కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో మహో హోమ్స్ ముత్యం బ్లాక్ లో వీరందరూ ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. అయితే వీటిని మహాహోమ్స్ 2021 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉండగా 2022 ఏప్రిల్‌లో హెచ్‌ఎండీఏ అధికారులు ఆక్యుపెన్సీ పత్రం ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తయినట్లు ఇచ్చే పత్రం మాత్రం ఇంకా రాలేదని కొనుగోలుదారులు ఫియాదు చేశారు. చెప్పిన టైమ్‌కు ఇవ్వలేదు.. అంతేకాదు కొన్నప్పుడు తమకు ఏదైతే చెప్పారో తరువాత అదే నిర్మాణం చేయ్యలేదని చెబుతున్నారు కొనుగోలుదారులు. అనుమతి పొందిన ప్లాన్‌కి, నిర్మాణానికి మధ్య వ్యత్యాసం ఉందని, మంచినీటి కనెక్షన్లు నిర్మాణంలో భాగమే అని చెప్పి ఆ తర్వాత అదనంగా రూ.45 వేల చొప్పున తీసుకున్నారని, ప్రతి ఫ్లాట్‌కి నీటిశుద్ధి వ్యవస్థ ఏర్పాట్లు చేస్తామని చెప్పి విఫలమయ్యారని కొనుగోలుదారులు కంప్లైంట్ చేశారు. వీటన్నితో పాటూ ముత్యం బ్లాక్ నీటి ట్యాంక్ పక్కనే సెప్టిక్ ట్యాంక్ నిర్మించారు. దీని వల్ల తాగునీరు కలుషితమౌతోంది. ఈ ఫిర్యాదులకు మహాహోమ్స్ కూడా స్పందించింది. కోవిడ్ కారణంగా నిర్మాణం ఆలస్యం అయిందని..కావాలని చేసిందని కాదని రెరాకు సమాధానం చెప్పింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత రెరా కొనుగోలుదారుల పక్షాన నిలిచింది. మహాహోమ్స్‌కు జరిమానా విధించింది. దాంతో పాటూ ప్రాజెక్టులో కొన్ని మార్చాలని సూచించింది. మహాహోమ్స్ కు రెరా రూ.6,58,226 జరిమానా విధించింది. దీన్ని 30 రోజుల్లో చెల్లించాలని చెప్పింది. అలాగే మొదట ఏదైతే చెప్పారో అదే ప్లాన్‌కు కట్టుబడి ఉండాలని..కమ్యూనిటీలో బీటీ రోడ్డు నిర్మించాలని, అగ్నిమాపక ఉపకరణాలు ఏర్పాటు చేయాలని, ఇంకుడుగుంతలు సరిగా పనిచేసేలా చూడాలని, ప్లాట్ యజమానుల సంఘానికి రూ.13,175 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఇక దీంతో పాటూ తెల్లాపూర్‌లోని ఎలియన్స్ స్పేస్ స్టేషన్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ మీద కూడా రెరా చర్యలను తీసుకుంది. 2017లో ఇవ్వాల్సిన ఇంటిని ఇప్పటివరకు ఇవ్వకపోవడమే కాకుండా...మరో రెండేళ్ళు టైమ్ అడగడంతో రెరా ఐన్ విధించింది. 2017 డిసెంబరు నుంచి ఆదేశాలు వెలువడిన రోజు అంటే డిసెంబరు 14వ తేదీ వరకూ.. మధ్యలో కొవిడ్ కాలాన్ని మినహాయించి.. ఫిర్యాదుదారు చెల్లించిన సొమ్ముపై 10.95 శాతం వార్షిక వడ్డీని 45 రోజుల వ్యవధిలో చెల్లించాలని, ఆక్యుపెన్సీ పత్రం జారీ చేసేవరకూ ఈ వడ్డీ కొనసాగుతూనే ఉండాలని తీర్పు చెప్పింది. Also Read: HYD: సంధ్యా థియేటర్‌కు షాక్..మూతపడనుందా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి