నన్ను హత్య చేయడానికే మా ఇంటికి వచ్చాడు–కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తనను హత్య చేయడానికే తన ఇంటికి వచ్చాడని మ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లోనే జరిగిందని అన్నారు. గాంధీకి పోలీసులు ఎస్కార్ట్ కూడా ఇచ్చారని ఆయన విమర్శించారు. 

New Update
mla koushik

 

 

జరగాల్సిన గొడవంతా జరిగాక, బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్ బయలుదేరాక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్తో కలసి మీడియాతో మాట్లాడారు. అరికపూడి తనను చంపాలనే తన ఇంటి మీదకు దాడికి వచ్చారని కౌశిక్ ఆరోపించారు. గాంధీ అలా వస్తుంటే అతనికి పోలీసులు ఎప్కార్ట్ ఇచ్చారని మండిపడ్డారు. ఇదంతా రేవంత్ రెడ్డే  కావాలని చేయించారని ఆరోపించారు. మాపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని కౌశిక్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగిరేంతవరకు పోరాడుతూనే ఉంటామని తెలిపారు. తెలంగాణలో మరో ఉద్యమానికి కాంగ్రెస్ తెరలేపిందని...వారు మొదలెట్టారు, తాము ముగిస్తామని అన్నారు కౌశిక్ రెడ్డి. 

తన మీద పోలీసులు కేసు పెట్టారు. తాను ఏం తప్పు చేశానో తెలపాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసలు నా మీద తప్పులు కేసులు బనాయించారు. నాపైనే దాడి చేసి, నా నోరే మూయించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరికపూడి గాంధీ మీద తమ ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు మా పార్టీ పోరాడుతుంది అన్నారు కౌశిక్ రెడ్డి. ఈ రాక్షస పాలనపై పోరాడుతూనే ఉంటాం. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం అని కౌశిక్‌రెడ్డి అన్నారు. 

అందరూ చూస్తుండగానే అరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో దుండగులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగింది. సీఎం రేవంత్‌ రెడ్డి పక్కాగా ప్లాన్‌ ఇచ్చి సినీఫక్కీలో చేయించారు. హరీశ్‌రావుతో పాటు ఇతర నేతలంతా శాంతియుతంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ దగ్గరకి ఫిర్యాదు చేయడానికి వెళితే, లోనికి రానివ్వలేదు. గేట్ల దగ్గరే అడ్డుకున్నారు. మేం ఫిర్యాదు చేయడానికి అర్హులం కాదా? కొంత మంది ఫిర్యాదు మాత్రమే తీసుకుంటారా? అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ప్రశ్నించారు. 

Advertisment
తాజా కథనాలు