Hyderabad: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. మాస్టర్ ను వారం రోజుల కస్టడీకి కోరారు నార్సింగి పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలను రంగారెడ్డి కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. 

New Update
jani master case

Jani Master Case:

కొరియోగ్రాఫర్‌‌ను రేప్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న  జానీ మాస్టర్‌ కేసు కస్టడీ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జానీ మాస్టర్‌ను 5 రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు కోరారు. పోక్సో కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్‌ వేసిన పిటిషన్‌ పై వాదనలను కోర్ట్ బుధవారానికి వాయిదా వేసింది.

తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ  అసిస్టెంట్‌ మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు మేర జానీ మాస్టర్‌‌ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. పోక్సో చట్టం కింద ఇతని ఈద కేసు నమోదు అయింది. జానీ మాస్టర్‌‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు ఇప్పుడు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో బస్ చక్రాల కిందపడి విద్యార్థి దుర్మరణం

Advertisment
తాజా కథనాలు