Tree Plantation In Hyderabad:
హైదాబాద్‌లో చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీ, అటవీ శాఖ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. వాల్టా చట్టం అమలుపై అధికారులతో చర్చించారు. రోడ్లు, కాలనీల్లో కూలే స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని, ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
హైడ్రా ఆఫీస్ లో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు జీహెచెఎంసీ, హైడ్రా, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫారెస్టు విభాగాలతో జోనల్ వారీగా టీమ్స్ ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో చెట్ల స్థితిపై సర్వే చేయాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఎండిపోయి లేదా కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను గుర్తించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కరెంటు తీగలకు.. ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారుతున్న చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేయాలని చెప్పారు.
Also Read: శాంతి మార్గమే ఉత్తమం..ప్రధాని మోదీ, జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు