HYDRA: వాగులో వెంచర్.. శిల్పాకు అధికారుల ఝలక్!

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని సదాశివపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామంలో నల్లవాగును శిల్పా గ్రూప్ కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తించారు. దీంతో మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

New Update

తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి నేలమట్టం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో వేసిన వెంచర్లను సైతం తొలగిస్తున్నారు. తాజాగా.. సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై అధికారుల సర్వే చేపట్టారు. సదాశివపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామంలో నల్లవాగును శిల్పా గ్రూప్ కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తించారు. సర్వే నెంబర్ 626, 627, 628లో ఈ వెంచర్ ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి:  ఉద్రిక్తతకు దారి తీసిన హైడ్రా అధికారుల సర్వే

నాలాను కబ్జా చేసి వెంచర్:

వెంచర్ కోసం నాలాను సైతం కబ్జా చేసినట్టు అధికారుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. వాగులో కబ్జాలు చేయడంతో ఇటీవల హైవేపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాగులో వేసిన వెంచర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే శిల్పా వెంచర్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ వెంచర్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం నల్లవాగులో 20 మీటర్లు కబ్జా చేసినట్లు తెలుస్తోంది.

#hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి