Hydra: పర్మిషన్ ఉంటే ఇళ్ళు కూల్చము–హైడా రంగనాథ్

ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.   ఎఫ్టీఎల్ లో ఉన్న ఇళ్ళకు పర్మిషన్లు ఉంటే వాటిని కూల్చమని అన్నారు. ఎఫ్టీఎల్ పరిధిని ఎలా నిర్దారణ చేయాలి, చెరువుల సమస్యలు వంటి అంశాలపై చర్చించామని అన్నారు.

chief
New Update

Hydra Commissioner Ranganath:

హైడ్రా గురించి...అది ఏం పనులు చేస్తుంది భవిష్యత్తులో అన్నదాని గురించి కమిషనర్ రంగనాథ్ వివరంగా చెప్పారు. 
హైడ్రా ఈ ఏడాది జులై లో ఏర్పడింది. ప్రభుత్వ స్థలాలు, నగరంలోని చెరువులు పరిరక్షించడంలో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడేందుకు గాను ప్రభుత్వం హైడ్రా ను కొత్తగా ఏర్పాటు చేసింది. హైడ్రా జిహెచ్ఎంసీ లో భాగం కాదు. ఇది వరకు ఈవిడీఎం పేరుతో జీహెచ్ఎంసీలో భాగంగా ఉండేది..ఇప్పుడు సెపరేట్ వింగ్ గా ఏర్పడింది అని చెప్పారు రంగనాథ్. హైడ్రా కు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందని అన్నారు.
ఇది దేశంలోనే మొదటి సారి ఏర్పాటు అయ్యింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధి  మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరో 27 మునిసిపాలిటీల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది చెప్పారు. 

వాటర్ బాడీస్, గవర్నమెంట్ ల్యాండ్స్, పబ్లిక్ అసెట్స్, లేక్స్ ఆక్రమణలకు గురవుతున్నాయి.. వాటిని హైడ్రా కాపాడుతుంది. హైదరాబాద్ అంటేనే గొలుసు కట్టు చెరువులు.. ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేది..  ఇపుడు కనెక్టివిటీ దెబ్బతింది. చెరువులు మాయమయ్యాయి నాలాలు కూడా సరి గా లేవు. సిటీలో  గట్టి వర్షం పడితే ముంపు.. ఏర్పడుతోంది.  తెలంగాణకు సముద్ర తీర ప్రాంతం లేనప్పటికీ భారీ వర్షాలతో వరద ముప్పు పొంచి వుంది. యీ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ (imd)సమాచారం చాల అవసరం.  సాకేతికతను అందిపుచ్చుకొని వర్షం సమాచారం యిస్తోంది. యీ సమాచారంతో కర్ణాటకలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం చాల సమర్ధవంతంగా పని చేస్తోందని చెప్పారు హైడ్రా కమిషనర్. ఏ ప్రాంతంలో ఎంత మొత్తం వర్షం పడుతోంది. ఆ వర్షంతో ఎక్కడ వరద ముప్పు వుంటుంది.. యివన్నీ అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆ విధానాలను హైడ్రా అంది పుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది.  యిలాంటి తరుణంలో imd పాత్ర చాలా కీలకం. IMD పని తీరుతోనే ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గాయి. 1977లో దివిసీమ ఉప్పెనలో 10 వేల మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు, కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. యిప్పుడు ఆ పరిస్థితులు లేవు.

అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్ల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ లో ఇళ్ళు ఉన్నప్పటికీ పర్మిషన్లు ఉంటే ఆ ఇళ్లను కూల్చబోమని అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో మీటింగ్ పెట్టామని.. ఎఫ్టీఎల్ పరిధిని ఎలా నిర్దారణ చేయాలి, చెరువుల సమస్యలు వంటి అంశాలపై చర్చించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను కాపాడుకోవడానికి ప్రజలను భాగం చేయించాలని.. ఇకనుంచి ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు రాకుండా చూసుకుంటామని అన్నారు. బెంగుళూరు లో చెరువుల పరిరక్షణ బాగుందని..  అక్కడ పర్యటించి అధ్యయనం చేశామని అన్నారు. చెరువుల పునరుద్దరణకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. సర్వే ఆఫ్ ఇండియా, అలుగు హైట్, విలేజ్ మ్యాప్, లేక్ స్ప్రెడ్ డేటా లను పరిగణనలోకి తీసుకుని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తామని చెప్పారు. 

Also Read: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్..మహా రిజల్ట్‌పై ఉత్కంఠత

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe